IND vs SA: టీమిండియాతో సిరీస్.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్! డైరెక్టర్, కోచ్‌పై విచారణ!
టీమిండియాతో సిరీసుకు ముందు దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. జాత్యహంకార ఆరోపణల నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్లు గ్రేమ్ స్మిత్, మార్క్ బౌచర్లను క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) విచారణకు ఆదేశించింది.
Cricket South Africa to investigate Graeme Smith, Mark Boucher over racism allegations: మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు గతవారం దక్షిణాఫ్రికా పర్యటన (South Africa Tour)కు వెళ్లిన సంగతి తెలిసిందే. డిసెంబరు 26 నుంచి సెంచూరియన్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు. సిరీస్ ఆరంభానికి ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో ప్రొటీస్ జట్టుకు భారీ షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్లు గ్రేమ్ స్మిత్ (Graeme Smith), మార్క్ బౌచర్ (Mark Boucher)లను క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) విచారణకు ఆదేశించింది. 2022లో అధికారిక విచారణ జరగనుంది.
ప్రస్తుతం గ్రేమ్ స్మిత్ క్రికెట్ దక్షిణాఫ్రికా డైరెక్టర్‌గా, మార్క్ బౌచర్ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లుగా ఉన్న సమయంలో నల్ల జాతీయుల క్రీడాకారుల పట్ల వివక్ష (Racism ) ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. జాతివివక్షకు సంబంధించి సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ (SJN) గతవారం ఇచ్చిన నివేదికలో స్మిత్, బౌచర్ పేర్లను ప్రస్తావించారు. వీరితో పాటుగా మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ పేరు కూడా ఉంది. ఎస్‌జేఎన్ ఇచ్చిన నివేదికకు కొనసాగింపుగా ఈ అంశంపై క్రికెట్ దక్షిణాఫ్రికా మరింత సమగ్రంగా విచారణ జరపాలని నిర్ణయించింది. 2022లో అధికారిక విచారణ ప్రారంభం కానుంది.
Also Read: IPL 2022 Mega Auction: ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఫిక్స్.. హైదరాబాద్ అభిమానులకు పండగే!!
జాత్యహంకారం (Racism)ని ఎట్టిపరిస్థితిలో సహించేది లేదని, దక్షిణాఫ్రికా కార్మిక చట్టం మరియు రాజ్యాంగం పరంగా న్యాయబద్ధత విచారణ చేస్తామని క్రికెట్ దక్షిణాఫ్రికా తెలిపింది. జాత్యహంకార ఆరోపణలు (Racism Allegations) నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇక డిసెంబర్ 26 నుంచి భారత్‌తో జరగనున్న సిరీస్ కోసం గ్రేమ్ స్మిత్ (Graeme Smith), మార్క్ బౌచర్ (Mark Boucher) తమ విధులను నిర్వహిస్తారు. ఓవైపు సిరీస్ కొనసాగుతుండగా.. మరోవైపు వీరిపై విచారణ జరగనుంది. జూలై 2012లో కంటి గాయం కారణంగా బౌచర్ కెరీర్ ముగిసింది. బౌచర్‌కు స్మిత్ సరైన అవకాశాలు ఇవ్వలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
Also Read: Yasir Shah: మైనర్‌పై అత్యాచారం.. పాకిస్తాన్ స్టార్ ఆటగాడిపై ఎఫ్ఐఆర్ నమోదు! ఇక కెరీర్ కంచికే!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook