ODI World Cup Song: భారత్‌ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్‌ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ కోసం ప్రత్యేక సాంగ్‌ను రూపొందించింది ఐసీసీ. ‘దిల్‌ జషన్‌ బోలే..’ అంటూ సాగే ఈ పాటలో రణ్‌వీర్‌ సింగ్‌తోపాటు చాహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ తదితరులు ఆడిపాడారు. ఈ మెగా సమరం ఇంగ్లాండ్ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఆరంభం కానుంది. టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో అక్టోబరు 08న ఆడనుంది. ఐసీసీ పురుషుల వన్డే వరల్ట్ కప్ అక్టోబరు 05 నుంచి నవంబరు 19 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ వరల్డ్ కప్ ప్రత్యేక సాంగ్ ను విడుదల చేసింది. మీరు చూసేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ ముగ్గురికి గోల్డెన్ టికెట్లు
ఈ మెగా టోర్నీకి మరింత  ప్రాచుర్యం కల్పించేందుకు బీసీసీఐ గోల్డెన్ టికెట్ల పంపిణీ చేపట్టింది. ఇందులో భాగంగా..దేశంలోని సెలెబ్రిటీలకు ఈ టికెట్లను ఇస్తుంది. ఇప్పటికే ఈ టికెట్ అందుకున్న వారిలో అమితాబ్ బచ్చన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండ్యూలర్, సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారు. ఈ టికెట్ ను పొందినవారు మ్యాచులన్నింటినీ వీఐపీ గ్యాలరీలో కూర్చుని సకల సౌకర్యాలతో ఫ్రీ వీక్షించవచ్చు. 


ప్రపంచ కప్ కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, కుల్దీప్ యాదవ్



Also Read: Mohammed Shami: వరల్డ్ కప్‌కు ముందు షమీకి బిగ్‌ రిలీఫ్.. వేధింపుల కేసులో బెయిల్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook