రాజ్‌కోట్‌: టీమిండియా క్రికెటర్ కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనతను సాధించాడు. ఇక్కడి సౌరాష్ట్ర క్రికెట్ అసెసియేషన్ (SCA) స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో భాగంగా రాహుల్ ఈ ఫార్మాట్‌లో 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు. అయితే వన్డేల్లో అత్యంత వేగవంతమైన (27 ఇన్నింగ్స్‌) ఫీట్‌లలో భారత్ తరఫున ఇది మూడోది, కాగా ఓవరాల్‌గా నాలుగో భారత క్రికెటర్‌గా  నిలిచాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (29 ఇన్నింగ్స్)ని అధిగమించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : Shikhar Dhawan: శిఖర్ ధావన్ సెంచరీ మిస్ 


కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్‌లకు ఈ ఫీట్ సాధించడానికి 24 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, నవజ్యోత్ సింగ్ సిద్దూ 25 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగుల మార్క్ చేరుకున్నాడు. రెండో వన్డే విజయం అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరో రాహుల్ మాట్లాడాడు. ఈ ఏడాది గొప్పగా ప్రారంభిస్తానని అనుకోలేదు. కానీ వికెట్ కీపింగ్‌లోనూ మంచి ఛాన్స్ దొరికింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కీపింగ్ చేయడంతో మరింత మెరుగయ్యాను. జట్టుకు అవసరమైతే ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేస్తానని’ రాహుల్ తెలిపాడు. 


కాగా, ముంబైలో జరిగిన వన్డేలో దారుణఓటమి చవిచూసిన విరాట్ కోహ్లీ సేన రాజ్ కోట్ వన్డేలో సత్తా చాటింది. తొలుత ఓపెనర్ శిఖర్ ధావన్(96; 90  బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్ కోహ్లీ (78; 76 బంతుల్లో 6 ఫోర్లు) రాణించగా.. చివర్లో రాహుల్ ( 80; 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తొలి వన్డేలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి విఫలమైన రాహుల్.. రెండో వన్డేలో 5వ స్థానంలో క్రీజులోకి వచ్చి ఆసీస్ బౌలర్లపై చెలరెగిపోయాడు. ఆపై కీపింగ్‌లో మెరుపు వేగంతో ఆరోన్ ఫించ్‌ను స్టంపౌట్ చేయడంతో పాటు రెండు క్యాచ్‌లు అందుకుని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నిర్ణయాత్మక మూడో వన్డే బెంగళూరు వేదికగా ఆదివారం (జనవరి 19న) జరగనుంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..