భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పాడు. తాను తండ్రిని కాబోతున్నట్లు విరాట్ కోహ్లీ వెల్లడించాడు. ఈ మేరకు అనుష్క శర్మ బేబీ బంప్‌ కనిపించేలా ఆమెతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. 2021 జనవరిలో మేం తల్లిదండ్రులం అవుతున్నామని వెల్లడించారు. తాము ముగ్గురం కాబోతున్నామని, ఓ బేబీ రానుందని నటి అనుష్క శర్మ (Anushka Sharma's Pregnancy) సైతం తాను గర్భం దాల్చిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో శుభవార్తను షేర్ చేసుకుంది.  IPL 2020 ప్రారంభానికి ముందే కేకేఆర్‌కు ఎదురుదెబ్బ



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా, ఇటీవల హార్ధిక్ పాండ్యా, నటి నటాషా స్టాన్‌కోవిక్ తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఆ సమయంంలో కోహ్లీ, అనుష్కలపై జోక్స్ పేలాయి. పెళ్లి కాకుండానే హార్దిక్ తండ్రయ్యాడని, మీ వంతు ఎప్పుడొస్తుందా అని విరుష్క దంపతులపై సెటైర్లు వేశారు. నేడు వాటికి ఒక్క ఫొటోతో కోహ్లీ, అనుష్క బదులిచ్చేశారు. 2017 డిసెంబర్ 11న ఇటలీలో కోహ్లీ, అనుష్కల వివాహం జరిగింది. కేవలం ఇరు కుటుంబసభ్యులు, కొందరు సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నామన్న శుభవార్తను ఎట్టకేలకు పంచుకున్నారు. Chris Gayle: విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్‌‌కు కరోనా నెగటివ్.. త్వరలో మరో పరీక్ష 
Virat Kohli: ఆర్సీబీ ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ వార్నింగ్ 
Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్