Cristiano Ronaldo: పోర్చుగ‌ల్(Portugal) స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) మరో అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. 2022 ప్రపంచకప్‌ గ్రూప్-ఎ క్వాలిఫయింగ్‌ పోటీల్లో భాగంగా.. మంగళవారం లక్సెంబర్గ్‌(Luxembourg)తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌(Hattrick) గోల్స్‌ సాధించి, తన జట్టును 5-0 తేడాతో గెలిపించాడు. ఈ క్రమంలో అతను అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక హ్యాట్రిక్ గోల్స్‌(10 సార్లు) సాధించిన తొలి ఫుట్‌బాలర్‌గా చరిత్ర సృష్టించాడు. రెండు పెనాల్టీలను గోల్‌గా మలిచిన రొనాల్డో(Ronaldo hat trick goals) ఆఖర్లో హెడర్‌ గోల్‌ నమోదు చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: T20 World Cup 2021: కొత్త జెర్సీలతో టీమిండియా.. క్షణాల్లో వైరల్ అయిన పోస్ట్


మొత్తంగా రొనాల్డో తన కెరీర్‌లో 58 హ్యాట్రిక్‌లు సాధించి, స‌మ‌కాలీన ఫుట్‌బాల‌ర్స్‌(Football)లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. కాగా, రొనాల్డో ఈ ఏడాది పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో అత్యధిక మ్యాచ్‌లు(182), అత్యధిక గోల్స్‌(115), అత్య‌ధిక అంత‌ర్జాతీయ హ్యాట్ర‌క్స్(10) వంటి రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. మరోవైపు డెన్మార్క్‌ ప్రపంచకప్‌కు అర్హత పొందిన రెండో జట్టుగా నిలిచింది. బుధవారం మ్యాచ్‌లో డెన్మార్క్‌ 1-0తో ఆస్ట్రియాపై గెలిచింది. జర్మనీ ప్రపంచకప్‌కు అర్హత పొందిన తొలి జట్టుగా నిలిచింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి