CSK IPL 2023 Full Schedule: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ షెడ్యూల్ ఇదే.. ఆ ప్లేయర్ ఎంట్రీతో మరింత పవర్ఫుల్
CSK IPL 2023 Full Schedule: సీఎస్‌కే.. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్.. నాలుగుసార్లు ఛాంపియన్. గతేడాది మినహా అన్ని సీజన్లలో ప్లే ఆఫ్‌కు చేరిన ఘనత. ఈసారి కూడా సూపర్ పర్ఫామెన్స్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ధోనికి ఇదే చివరి సీజన్ కావడంతో టైటిల్ విన్ అవ్వాలని కోరుకుంటున్నారు.
CSK IPL 2023 Full Schedule: క్రికెట్ అభిమానులకు మరికొద్ది రోజుల్లో పండుగ మొదలుకాబోతుంది. మార్చి 31 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ లీగ్ రౌండ్‌లో ఒక్కో జట్టు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అన్ని జట్లు హోమ్ గ్రౌండ్‌లో 7 మ్యాచ్‌లు.. ప్రత్యర్థి మైదానంలో 7 మ్యాచ్‌లు ఆడతాయి.
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదో టైటిల్‌పై గురిపెట్టింది. ఈసారి వేలంలో స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను తీసుకోవడం చెన్నై జట్టుపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావడంతో ఛాంపియన్‌గా నిలిచి ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు సీఎస్‌కే.. గత సీజన్‌లో మొదటిసారి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈసారి కచ్చితంగా ప్లే ఆఫ్‌కు చేరుకుంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి షెడ్యూల్ ఇలా..
==> మ్యాచ్ 1: మార్చి 31- గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, అహ్మదాబాద్ (7:30 PM)
==> మ్యాచ్ 2: ఏప్రిల్ 3- చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై (7:30 PM)
==> మ్యాచ్ 3: ఏప్రిల్ 8- ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, ముంబై (7:30 PM)
==> మ్యాచ్ 4: ఏప్రిల్ 12- చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్, చెన్నై (7:30 PM)
==> మ్యాచ్ 5: ఏప్రిల్ 17- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు (7:30 PM)
==> మ్యాచ్ 6: ఏప్రిల్ 21- చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై (7:30 PM)
==> మ్యాచ్ 7: ఏప్రిల్ 23- కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా (7:30 PM)
==> మ్యాచ్ 8: ఏప్రిల్ 27- రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, జైపూర్ (7:30 PM)
==> మ్యాచ్ 9: ఏప్రిల్ 30- చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్, చెన్నై (3:30 PM)
==> మ్యాచ్ 10: మే 4- లక్నో సూపర్ జెయింట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, లక్నో (3:30 PM)
==> మ్యాచ్ 11: మే 6- చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్, చెన్నై (3:30 PM)
==> మ్యాచ్ 12: మే 10- చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై (7:30 PM)
==> మ్యాచ్ 13: మే 14- చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై (7:30 PM)
==> మ్యాచ్ 14: మే 20- ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ (3:30 PM)
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టీమ్: ఎంఎస్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ శాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌షౌ, తుషార్ దేశష్‌పాన్ పతిరానా, సిమర్‌జీత్ సింగ్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, అజింక్యా రహానే, బెన్ స్టోక్స్, షేక్ రషీద్, నిశాంత్ సింధు, కైల్ జేమీసన్, అజయ్ మండల్, భగత్ వర్మ.
Also Read: Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తం.. టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వంశీ వర్గీయులు దాడి
Also Read: Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. తిరుమలలో ఇక నుంచి కొత్త రూల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook