CSK Vs RCB IPL 2024: క్రికెట్ లవర్స్ సిద్ధమైపోండి.. నేడే క్రికెట్ పండగ ఆరంభం.. చెన్నైతో ఆర్‌సీబీ ఢీ..!
Chennai Super Kings Vs Royal Challengers Bangalore Match Preview: చెన్నై, ఆర్‌సీబీ జట్ల మధ్య పోరుతో నేడు ఐపీఎల్ 2024 వార్ మొదలుకానుంది. వినోదాన్ని పంచేందుకు పది జట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. కొత్త కెప్టెన్లు, కొత్త ఆటగాళ్లతో అన్ని జట్లు కళకళలాడుతున్నాయి.
Chennai Super Kings Vs Royal Challengers Bangalore Match Preview: నేటి నుంచి క్రికెట్ పండుగ ఆరంభంకానుంది. క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రెండు నెలలపాటు అలరించేందుకు సిద్ధమైంది. ఐపీఎల్ 2024 మెగా టోర్నీ శుక్రవారం నుంచి తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఐపీఎల్ ఆరంభ వేడుకలు సాయంత్రం 6.30 గంటలకే మొదలుకానున్నాయి. చెన్నైను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోని.. ఈసారి సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈసారైనా కప్ ముద్దాడాలనే లక్ష్యంతో ఆర్‌సీబీ బరిలోకి దిగుతోంది.
Also Read: Delhi Liquor Case: లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇవ్వని సుప్రీం ధర్మాసనం..
ఈ సీజన్‌లో ఆరు జట్లు కొత్త కెప్టెన్లతో ఆడనున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్థిక్ పాండ్యాను ఎంపిక చేసింది. గుజరాత్ టైటాన్స్ నుంచి పాండ్యా వచ్చేయడంతో శుభుమన్ గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి గతేడాది సీజన్‌కు దూరమైన రిషబ్ పంత్ తిరిగి జట్టుతో చేరాడు. గత సీజన్‌కు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఈసారి పగ్గాలు మళ్లీ పంత్ చేతికి వచ్చాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతోంది. ఆసీస్‌కు వరల్డ్ కప్ అందించిన పాట్ కమిన్స్‌ను వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఎస్‌ఆర్‌హెచ్.. కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గాయం కారణంగా గత సీజన్‌కు దూరమైన శ్రేయాస్ అయ్యర్.. తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గత సీజన్‌లో నితీశ్ రాణా కెప్టెన్‌గా ఉన్నాడు.
చెన్నై, ఆర్‌సీబీ మ్యాచ్ విషయానికి వస్తే.. రెండు జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శార్దుల్ ఠాకూర్, శివమ్ ధుబేకి తోడు అజింక్యా రహనే, ఎంఎస్ ధోని వంటి ఆటగాళ్లతో చెన్నై బలంగా కనిపిస్తోంది. అటు ఆర్‌సీబీ కూడా బ్యాటింగ్‌లో స్ట్రాంగ్ ఉన్నా.. బౌలింగ్‌లో కాస్త బలహీనంగా కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్, ఫాప్ డుప్లెసిస్ త్రయంపై భారీ ఆశలు ఉండగా.. స్టార్ ఆల్‌రౌండర్ కామెరున్ గ్రీన్ చేరికతో మరింత పటిష్టంగా మారనుంది. బౌలింగ్‌లో అల్జరీ జోసఫ్, మహ్మద్ సిరాజ్‌పైనే ఆశలన్నీ ఉన్నాయి. నాణ్యమైన స్పిన్నర్‌లేని లోటు ఆర్‌సీబీని వెంటాడుతోంది.
ప్లేయింగ్ 11 ఇలా (అంచనా):
ఆర్‌సీబీ: ఫాప్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, కామెరూన్ గ్రీన్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేసాయి, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), మయాంక్ డాగర్, అల్జారీ జోసెఫ్, మహ్మద్ సిరాజ్.
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, శార్దూల్ ఠాకూర్
Also Read: Kidnap Drama: 'ఇది బిగనర్స్ మిస్టేక్స్ చూసుకోవాలి కదా!'.. బెడిసికొట్టిన యువతి కిడ్నాప్ డ్రామా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter