గోల్డ్ కోస్ట్:  2018 కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల జోరు కొనసాగుతోంది. పురుషుల 57 కిలోల రెజ్లింగ్‌ విభాగంలో భారత్‌కు చెందిన రెజ్లర్ రాహుల్‌ అవారె బంగారు పతకం సాధించాడు. ఫైనల్లో కెనడాకు చెందిన స్టీవెన్ తకహషిను 15-7తో రాహుల్ అవేర్ ఓడించాడు. తొలి పీరియడ్‌లో 6-4, రెండో పీరియడ్ తర్వాత 9-6తో లీడ్‌లో ఉన్న రాహుల్.. చివరి పీరియడ్‌లో మరింత చెలరేగి 15-7తో మ్యాచ్ గెలిచాడు. భారత్‌కు ఇది 13వ బంగారు పతకం.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


53 కేజీల మహిళల రెజ్లింగ్‌లో బబితా కుమారి పోఘట్ రజత పతకం సాధించగా...షూటింగ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోస్‌లో తేజస్విని రజత పతకం సాధించడం విశేషం. అలాగే 76 కేజీల మహిళల రెజ్లింగ్‌లో కిరణ్ కాంస్య పతకం సాధించడం గమనార్హం. దీంతో భారత్ ఖాతాలోకి మొత్తం 27 పతకాలు చేరాయి. ప్రస్తుతం 13 స్వర్ణాలు, 5 రజతాలు, 9 కాంస్యాలు భారత్ ఖాతాలో ఉన్నాయి. భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.