David Warner Double Century: వెటరన్ ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఎట్టకేలకు డబుల్‌ సెంచరీ బాదాడు. మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం (ఎంసీజీ)లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదిన వార్నర్.. తన టెస్ట్ సెంచరీ కరువుకు ముగింపు పలికాడు. దాదాపుగ 1089 రోజుల తర్వాత సెంచరీ బాదిన దేవ్ భాయ్.. వందను డబుల్‌ సెంచరీగా మలిచి తనలో ఇంకా సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. వార్నర్ కెరీర్‌లో ఇది 100వ టెస్ట్ మ్యాచ్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కెరీర్‌లో 100వ టెస్టులో డబుల్ సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా డేవిడ్ వార్నర్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ సీనియర్ ప్లేయర్ జో రూట్ ముందున్నాడు. రూట్‌ గతేడాది ఫిబ్రవరిలో ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఇక 100వ టెస్టులో డబుల్ సెంచరీ బాదిన మొదటి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా వార్నర్ చరిత్రకెక్కాడు. ద్విశతకం బాదిన అనంతరం వార్నర్‌ కాలి కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. 253 బంతుల్లో 200 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దేవ్ భాయ్ మైదానాన్ని వీడాడు.



గత మూడు టెస్టు మ్యాచుల్లో డేవిడ్ వార్నర్ పరుగులు చేయలేదు. మూడు టెస్టుల్లో వార్నర్ 5, 48, 21, 28, 0, 3 స్కోర్లు చేశాడు. అంతకుముందు కూడా పెద్దగా రాణించలేదు. దాంతో జట్టులో వార్నర్ స్థానం ప్రశ్నార్థకమైంది. చాలామంది మాజీలు వార్నర్ పనియిపోయిందన్నారు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది అని కూడా విమర్శించారు. వాళ్లందరికీ వార్నర్ తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు. రెండో రోజు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న వార్నర్.. 16 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ చేశాడు.


డబుల్ సెంచరీ అనంతరం డేవిడ్ వార్నర్ తనదైన స్టైల్‌లో సంబరాలు చేసుకున్నాడు. అప్పటికే తొడ కండరాలు పట్టేసినా.. చాలాకాలం తర్వాత పరుగులు చేయడంతో ఎమోషనల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. పెద్దగా గర్జిస్తూ పైకెగిరి పంచ్ ఇచ్చి సంతోషం వ్యక్తం చేశాడు. దాంతో ఫాన్స్ మైదానంలో గట్టిగా అరిచారు. తొడ కండరాల నొప్పితో అప్పటికే అలిసిపోయి ఉన్న వార్నర్.. ఆ తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 386 పరుగులతో నిలిచింది. అంతకుముందు ప్రొటీస్ 189 పరుగులకు ఆలౌట్ అయింది.


Also Read : Anchor Suma : మల్లెమాల, ఈటీవికి యాంకర్ సుమ గుడ్ బై?.. అందరూ ఎందుకిలా చేస్తున్నారో


Also Read : Anchor Suma : మల్లెమాల, ఈటీవికి యాంకర్ సుమ గుడ్ బై?.. అందరూ ఎందుకిలా చేస్తున్నారో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook