David Warner exceptional fielding video goes viral during Australia vs Sri Lanka match: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఫీల్డింగ్‌ చేశాడు. మైదానంలో చురుకుగా కదులుతూ బౌండరీలను ఆపిన వార్నర్.. ఆపై కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి బంతిని అందుకుని జట్టుకు నాలుగు పరుగులు సేవ్ చేశాడు. ప్రస్తుతం వార్నర్‌ ఫీల్డింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా ఆస్ట్రేలియా బౌలర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ వేసిన ఇన్నింగ్స్‌ 11వ ఓవర్ నాలుగో బంతిని.. లంక బ్యాటర్‌ ధనుంజయ డిసిల్వా లాంగ్‌ ఆఫ్‌ మీదుగా షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద ఉన్న డేవిడ్ వార్నర్ వెనక్కి పరుగెడుతూ.. ఫుల్ లెంగ్త్ డైవ్‌ చేస్తూ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. అయితే సమన్వయం కోల్పోయిన దేవ్ భాయ్ బంతిని వెనక్కి విసిరేసి.. బౌండరీ లోపల పడ్డాడు. దాంతో జట్టుకు 4 పరుగులు సేవ్ చేశాడు. 


ఆస్టన్ అగర్ వేసిన మరుసటి ఓవర్‌లో డేవిడ్ వార్నర్ పట్టిన సూపర్ క్యాచ్‌కు ధనంజుయ డిసిల్వా ఔట్ అయ్యాడు. అగర్ వేసిన బంతిని ధనంజయ్ భారీ షాట్ ఆడగా.. లాంగాఫ్‌లో ఉన్న వార్నర్ వెనక్కి పరుగెడుతూ గాల్లోకి ఎగిరిని కళ్లు చెదిరే రీతిలో బంతిని పట్టేశాడు. ఇందుకు సంబందించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వార్నర్ ఫీల్డింగ్‌కు నెటిజన్లు ఫీదా అవుతున్నారు. 35 ఏళ్ల వయసులోనూ వార్నర్ ఫీల్డింగ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



ఈ మ్యాచులో శ్రీలంకపై డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. పథుమ్‌ నిస్సంక (40; 45 బంతుల్లో 2 ఫోర్లు), చరిత అసలంక (38 నాటౌట్‌; 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధనంజయ డిసిల్వా (26; 23 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. ఆపై ఆసీస్‌ 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మార్కస్ స్టొయినిస్‌ (59 నాటౌట్‌; 18 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్‌ సెంచరీతో జట్టును విజయాన్ని అందించాడు. 


Also Read: Indians In Ukraine : ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు మరో హెచ్చరిక


Also Read: CCI Fines On Google: గూగుల్‌కు మరోసారి భారీ జరిమానా.. కారణం ఇదే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook