Candice Warner Twitter: ‘వార్నర్ ఫామ్ లో లేడా?’.. ఐపీఎల్ ఫ్రాంఛైజీపై వార్నర్ భార్య ఫైర్?
Candice Warner Twitter: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో.. తన అద్భుతమైన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్. ఈ సందర్భంగా అతడ్ని పలువురు అభినందిస్తున్నారు. అయితే వార్నర్ భార్య అందుకు భిన్నంగా స్పందించింది. ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ ప్రాతినిధ్యం వహించే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి ట్విట్టర్ లో పరోక్షంగా చురకలు అంటించింది. ఇప్పుడా ట్వీట్ వైరల్ గా మారింది.
Candice Warner Twitter: ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ రెండో దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ డేవిడ్ వార్నర్.. అంచనాలకు తగ్గట్లు ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఆ టీమ్ యాజమాన్యం వార్నర్ ను కొన్ని మ్యాచులకు తప్పించింది. ఆటగాడు ఫామ్ లో లేడన్న నేపంతో వార్నర్ ను టీమ్ నుంచి తప్పించారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో వార్నర్ డగౌట్ లో కాకుండా స్టాండ్స్ లో కూర్చొని తన జట్టుకు మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే వార్నర్ ను సన్ రైజర్స్ జట్టు నుంచి అనూహ్యంగా తప్పించడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. టీ20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లతో పాటు ఆరంభం మ్యాచ్‌ల్లోను వార్నర్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో వార్నర్ కెరీర్ ముగిసినట్లేనని, ఫామ్ కోల్పోయిన అతను మరీ నెమ్మదిగా ఆడుతున్నాడని, అతని బ్యాటింగ్ పాత తరంలా ఉందని విమర్శలు గుప్పించారు.
అయితే శ్రీలంకతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చిన వార్నర్ తన ఫామ్‌ను ఫైనల్ వరకు కొనసాగించాడు. అద్వితీయమైన బ్యాటింగ్‌తో ఆసీస్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 7 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలతో 284 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఇప్పుడు వార్నర్ భార్య ట్విట్టర్ లో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. వార్నర్ పై విమర్శకులు చేసిన ప్రతీ మాటను గుర్తు పెట్టుకున్న ఆమె.. తనదైన శైలిలో బదులిచ్చింది. వార్నర్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ ఫొటోను షేర్ చేస్తూ.. “ఫామ్ లో లేడా? పాత తరం ఆట ఆడుతున్నాడా?” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ఇప్పుడా ట్వీట్ వైరల్ గా మారింది.
ఆస్ట్రేలియాకు తొలి టీ20 ట్రోఫీ
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కివీస్ సారథి కేన్ విలియమ్సన్(85) చెలరేగాడు. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్(77), డేవిడ్ వార్నర్(53) అద్భుతంగా బ్యాటింగ్ చేసి తమ జట్టును గెలిపించుకున్నారు.
Also Read: Cheating Case On Shilpa Shetty: ‘నా హక్కులను కాపాడండి’.. చీటింగ్ కేసుపై శిల్పాశెట్టి స్పందన
Also Read: Ghani Movie Teaser: మెగా పవర్ స్టార్ వాయిస్ ఓవర్ తో.. వరుణ్ తేజ్ ‘గని’ టీజర్ వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook