Ghani Movie Teaser: మెగా పవర్ స్టార్ వాయిస్ ఓవర్ తో.. వరుణ్ తేజ్ ‘గని’ టీజర్ వచ్చేసింది

Ghani Movie Teaser: టాలీవుడ్​ యంగ్​ హీరో వరుణ్​ తేజ్​ హీరోగా నటిస్తున్న చిత్రం 'గని'. డిసెంబరు 24న సినిమా రిలీజ్​ (Ghani Movie Release Date) కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్​ మొదలుపెట్టింది. సినిమా టీజర్ ను సోమవారం (నవంబరు 15) ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఆకట్టుకునే విధంగా ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2021, 11:39 AM IST
    • వరుణ్ తేజ్ సినిమా ‘గని’ సినిమా టీజర్ రిలీజ్
    • వాయిస్ ఓవర్ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
    • డిసెంబరు 3న రిలీజ్ కానున్న ‘గని’ చిత్రం
Ghani Movie Teaser: మెగా పవర్ స్టార్ వాయిస్ ఓవర్ తో.. వరుణ్ తేజ్ ‘గని’ టీజర్ వచ్చేసింది

Ghani Movie Teaser: మెగా ప్రిన్స్​ వరుణ్​ తేజ్​ అప్​కమింగ్​ మూవీ (Varun Tej Upcoming Movie) 'గని' నుంచి ఓ క్రేజీ అప్​డేట్​ వచ్చేసింది. సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఇటీవలే విడుదలైన 'గని ఫస్ట్​ పంచ్​' గ్లింప్స్​ (Ghani First Punch)తో పాటు ఫస్ట్ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల (Ghani Movie Release Date) చేయనున్నట్టు చిత్రబృందం ఇటీవలే వెల్లడించింది. 'గని' సినిమా రిలీజ్​ డేట్​ దగ్గర పడుతున్న క్రమంలో చిత్ర ప్రమోషన్స్​ను నిర్మాతలు మొదలుపెట్టేశారు. 

'గని' సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్​గా కనిపించనున్నాడు. అందులో వరుణ్​ తేజ్​ సరసన బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar New Movie) జంటగా నటిస్తుండగా కన్నడ స్టార్​ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్న ఈ 'గని' చిత్రాన్ని రెనైసన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్‌పై సిద్దు ముద్దా, అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు. వరుస హిట్స్‌తో జోష్ మీదున్న ఎస్​ఎస్ తమన్​ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రాఫర్​గా వర్క్​ చేస్తున్నాడు. 

వరుణ్ తేజ్ (Varun Tej News) కెరీర్‌లో మరో మైలురాయిగా 'గని' చిత్రం నిలిచిపోతుందని ఈ సినిమా మేకర్స్ చెబుతున్నారు. చిత్ర నిర్మాతలు చెబుతున్నట్లుగా 'గని' చిత్రం (Varun Tej Ghani Movie) అంచనాలకు తగ్గట్లు ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 

వరుణ్ తేజ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం వరుణ్ 'ఎఫ్​ 3' సినిమా (Varun Tej New Movie) షూటింగ్​లో బిజీగా ఉన్నాడు. 'ఎఫ్​ 2' సినిమాకు సీక్వెల్‌గా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోనే షూటింగ్ (F3 movie shooting sets) జరుపుకొంటోంది. విక్టరీ వెంకటేష్​, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  

Also Read: Akhanda Trailer: ‘'మీకు సమస్య వస్తే దండం పెడతారు..మేము ఆ సమస్యకే పిండం పెడతాం'..అదిరిన 'అఖండ' ట్రైలర్

Also Read: Aha OTT: ఆహా ఓటీటీలో సందడి చేయనున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’..స్ట్రీమింగ్ ఎప్పుడంటే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News