న్యూ ఢిల్లీ : ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో ( T20I ICC rankings ) ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ ( Dawid Malan ) నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచుల సిరీస్‌లో 129 పరుగులు సాధించి మంచి పర్‌ఫార్మెన్స్ కనబర్చడం అతడికి బాగా కలిసొచ్చింది. దీంతో ఈసారి అతడు ఏకంగా మరో 4 స్థానాలు పైకి ఎగబాకాడు. నెంబర్ 1 స్థానంలోకి డేవిడ్ మలన్ రాకతో ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న పాకిస్థాన్ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్ ( Babar Azam ) 2వ స్థానానికే పరిమితమయ్యాడు. ఇక భారత బాట్స్‌మేన్‌ విషయానికొస్తే.. కేఎల్‌ రాహుల్‌ రెండు స్థానాలు దిగజారి 4వ స్థానానికి పడిపోగా... విరాట్‌ కోహ్లీ ( Virat Kohli ) ఒక స్థానాన్ని మెరుగు పరుచుకొని 9వ స్థానంలో నిలిచాడు. Also read : Rohit Sharma's six hits bus: రోహిత్ శర్మ సిక్సర్ షాట్.. బస్సుకి తగిలిన బాల్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐసిసి ప్రకటించిన టీ20 ఇంటర్నేషనల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 10లో భారత బౌలర్లకు ( Indian bowlers ) ఎవ్వరికీ చోటు దక్కలేదు. బౌలర్ల కేటగిరిలో అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్లు రషీద్‌ ఖాన్‌, ముజీబుర్‌ రెహ్మాన్‌ వరుసగా 1, 2 స్థానాలు సొంతం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకున్నారు. భారత్ నుంచి జస్ప్రిత్ బుమ్రా 12వ ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. Also read : Rafale fighter jets: జాతికి అంకితం కానున్న రఫేల్ యుద్ధ విమానాలు


ఇక జట్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా టాప్ ర్యాంక్ సొంతం చేసుకోగా.. రెండో స్థానంలో ఇంగ్లాండ్‌, మూడో స్థానంలో భారత్‌ నిలిచాయి. మరో 10 రోజుల్లో ఐపిఎల్ 2020 ప్రారంభం ( IPL 2020 inaugural ceremony ) అవుతుందనగా ఐసిసి ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్ టాప్ 10 ఆటగాళ్లలో కొంతమందికి మంచి ఉత్సాహాన్నిస్తే.. ర్యాంకింగ్స్‌లో వెనకబడిన ఇంకొందరు ఆటగాళ్లకు ఆటపై కసిని పెంచడం ఖాయం. Also read : Cow urine Hand sanitizers: గోమూత్రంతో శానిటైజర్.. కరోనాక్ చెక్ పెడుతుందా ?