DC vs RR: చివరి ఓవర్లో `నో బాల్` లొల్లి.. ఉత్కంఠ పోరులో ఢిల్లీపై రాజస్థాన్ విజయం!
Rajasthan Royals beat Delhi Capitals by 15 runs. ఐపీఎల్ 2022లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది.
Jos Buttler century helps Rajasthan Royals crush Delhi Capitals by 15 runs: ఐపీఎల్ 2022లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్లో 'నో బాల్' లొల్లితో మ్యాచ్ కాసేపు ఆగగా.. రాజస్థాన్ విజయాన్ని మాత్రం ఢిల్లీ అడ్డుకోలేకపోయింది. 223 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 207 పరుగులు మాత్రమే చేసి.. 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. రిషబ్ పంత్ (44), రోవ్‌మెన్ పావెల్ (36), లలిత్ యాదవ్ (37) ధాటిగా ఆడారు. రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు.
223 పరుగుల భారీ టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు పృథ్వీ షా (37), డేవిడ్ వార్నర్ (28) తొలి ఓవర్ నుంచే బాదుడు మొదలెట్టారు. ఈ క్రమంలో ఢిల్లీ స్కోర్ పరుగులు పెట్టింది. దూకుడుగా ఆడిన వార్నర్ పెవిలియన్‌కు చేరగా.. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (1) విఫలమయ్యాడు. వికెట్లు పడుతున్నా.. పృథ్వీ షా, రిషబ్ పంత్ (44) ధాటిగానే ఆడారు. స్వల్ప వ్యవధిలో షా, పంత్ సహా అక్షర్ పటేల్ (1) వికెట్లను కోల్పోవడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. అయితే లలిత్ యాదవ్ (37) జట్టును ఆదుకున్నాడు.
ఆఖరి రెండు ఓవర్లలో ఢిల్లీ విజయానికి 36 పరుగులు కావాల్సిన తరుణంలో 19వ ఓవర్‌ను ప్రసిధ్ కృష్ణ మెయిడిన్ వేసి ఒక వికెట్ తీశాడు. చివరి ఓవర్‌లో మొదటి మూడు బంతులకు 3 సిక్స్‌లు కొట్టిన రోవ్‌మన్ పావెల్ (36) ఢిల్లీని గెలిపించినంత పని చేశాడు. అయితే మూడో బంతిని మెక్‌కాయ్ ఫుల్‌టాస్ వేశాడు. అది నోబాల్ అని ఢిల్లీ వాదించింది. కెప్టెన్ పంత్, కోచింగ్ సిబ్బంది గందరగోళానికి తెరతీశారు. ఆటగాళ్లను ఆడకుండా వచ్చేయాలని పంత్ సైగలు చేశాడు. అయితే అంపైర్లు అది నోబాల్ కాదని స్పష్టం చేశారు. మెక్‌కాయ్ మిగతా మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులే ఇచ్చి పావెల్‌ను ఔట్ చేయడంతో రాజస్థాన్ విజయం సాధించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ (116) శతకం సాధించగా.. మరో ఓపెనర్ దేవదుత్ పడిక్కల్ (54), కెప్టెన్ సంజూ శాంసన్ (46) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ (1/47), లలిత్ యాదవ్ (0/41), ముస్తాఫిజర్ (1/43), కుల్‌దీప్ యాదవ్ (0/40) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముస్తాఫిజర్, అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.
ALso Read: Wasim Khan ICC: ఐసీసీ జనరల్ మేనేజర్‌గా మాజీ క్రికెటర్ వసీం ఖాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.