ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 42వ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తొలి 4 ఓవర్లకే పాతిక పరుగులైనా చేయకుండానే రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. 3.5 ఓవర్ వద్ద షకీబ్ అల్ హసన్ విసిరిన బంతిని పృద్వీ షా 9 పరుగులు (11 బంతుల్లో 4X1) హిట్ ఇవ్వబోయి శిఖర్ ధావన్ చేతికి చిక్కి ఔట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 21 మాత్రమే. ఆ తర్వాతి బంతికే జేసన్ రాయ్ 11 పరుగులు (13 బంతుల్లో 4X2) సైతం గోస్వామికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి రిశబ్ పంత్ మ్యాచ్‌ని చక్కబెడుతున్నాడు అనుకునే క్రమంలోనే 7.4 ఓవర్ వద్ద శ్రేయాస్ 3 పరుగులు (8 బంతుల్లో) గోస్వామి చేతిలో రనౌట్ అయ్యాడు. మొత్తంగా తొలి 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికీ ఢిల్లీ జట్టు కేవలం 48 పరుగులకే మూడు వికెట్లు నష్టపోయింది. అంతకన్నా ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్‌కే మొగ్గుచూపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ 2018 విజయాల పట్టికలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు అట్టడుగు స్థానంలో వుండగా సన్‌రైజర్స్ హైదరాబాట్ అగ్రభాగాన వుంది. ఈ ఐపీఎల్లో ఇంకా ముందుకు సాగాలంటే ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిన అవసరం వుంది. ఢిల్లీ జట్టు ఈ సీజన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడగా అందులో కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సొంతం చేసుకుంది. 


→ Click here to get DD vs SRH live score updates