ప్రపంచ నేతలారా! `మా దేశాన్ని ఈ గందరగోళం నుంచి కాపాడండి`: రషీద్ ఖాన్
Rashid Khan: `నా దేశాన్ని కాపాడండి`... అంటూ ప్రపంచ నేతల్ని కోరుతున్నాడు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందంటే..
Rashid Khan: అఫ్గానిస్థాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ నేతలంతా చొరవ తీసుకోవాలని స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ ట్విట్టర్ ద్వారా కోరారు. పిల్లలు, మహిళలు సహా పౌరులు ప్రాణాలు కోల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్తినష్టం విపరీతంగా జరుగుతోందని ఆందోళన చెందాడు.
అమెరికా(America) తన సేనలను క్రమక్రమంగా ఉపసంహరించుకోవటంతో...అఫ్గానిస్థాన్(Afghanistan) లో తాలిబన్ల్(Talibans) అరాచకం ఎక్కువైపోయింది. తాలిబన్లు ఉగ్రదాడులతో చెలరేగుతున్నారు. పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. అశాంతి తాడవిస్తోంది. హెల్మండ్, కాందహార్, హెరాత్ రాష్ట్రాల్లో నెల రోజుల నుంచి ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే వెయ్యికి పైగా ప్రజలు మరణించడమో లేదా గాయపడటమో జరిగినట్లు తెలుస్తోంది.
Also Read: ఆ దేశంలో ఉన్న ఇండియన్స్ వెంటనే తిరిగి రాకపోతే ప్రమాదమే
మే 1 నుంచి అమెరికా(America) తమ సేనలను వెనక్కి రప్పిస్తోంది. అప్పట్నుంచి వరుసగా ఉగ్ర దాడులు జరుగుతున్నాయి. అఫ్గాన్‌లోని 400 జిల్లాలను ఇప్పటికే తాలిబన్లు(Talibans) వశపరుచుకున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)లోని 65 శాతం భూభాగం మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆగష్టు 31 నాటికి అమెరికా తన పూర్తి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది.
ఇటువంటి తరుణంలో.. ‘ప్రియమైన ప్రపంచ నాయకులారా! నా దేశంలో అరాచకత్వం రాజ్యమేలుతోంది. ప్రతిరోజూ వేలాది మంది అమాయకులు, పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇళ్లు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. వేలాది కుటుంబాలు తరలిపోతున్నాయి. మమ్మల్ని ఇలాంటి గందరగోళంలో పడేయకండి. అఫ్గాన్ పౌరుల మరణాలు, అఫ్గానిస్థాన్ నాశనాన్ని ఆపేయండి. మాకు శాంతి కావాలి’ అని రషీద్( Rashid Khan:)ట్వీట్ చేశాడు. అతడి ట్వీట్‌కు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అంతేకాదు తన ట్విటర్ ద్వారా నిస్సహాయులకు సాయం చేసేందుకు ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook