Shikhar Dhawan: శిఖర్ ధావన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోవట్లేదా?
IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్లో శిఖర్ ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడే అవకాశాలు కనిపించడం లేదు. మెగా వేలానికి ముందు శిఖర్ ధావన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోకపోవచ్చని సమాచారం.
Delhi Capitals May not Retaine Shikhar Dhawan for IPL 2022: వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 15వ సీజన్ మరింత ఆసక్తికరంగా మారనుంది. వచ్చే ఏడాది రెండు కొత్త టీమ్స్ ఐపీఎల్లో (New teams to IPL 2022) భాస్వామ్యం కానున్నాయి.
అయితే అంతకు ముందు ఐపీఎల్ 2022కు సంబంధించి మెగా వేలం (IPL 15 mega Auction) జరగనుంది. దీనితో వచ్చే ఏడాది ఐపీఎల్లో ప్రతి టీమ్‌లో భారీ మార్పులు చోటు చేసుకోనన్నాయి. ఈ ఏడాది డిసెంబర్లోనే ఈ మెగా వేలం నిర్వహిచనుంది బీసీసీఐ. ఈ నేపథ్యంలో ఐపీఎల్ జట్లన్నిటికి నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసేందుకు అవకాశం కల్పించింది.
రిటైన్ అవకాశాలు ఇలా..
మెగా వేలానికి ముందు ప్రతి టీమ్‌లో ప్రస్తుతం ఆడుతున్న నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్చేసుకునేందుకు వీలుంది. మిగతా ప్లేయర్స్ అందరిని వేలంలో కొనాల్సిందే. అందులో ఓ విదేశీ ఆటగాడు ఉండాలనేది నిబందన.
ఈ నేపథ్యంలో టీమ్స్ అన్ని ప్లేయర్స్‌ను రైటన్ చేసుకోవాల్సిన నలుగురు ప్లేయర్స్ జాబితాను రెడీ చేసే పనిలో పడ్డాయి.
Also read: IND vs NZ 1st Test: టీమిండియాదే బ్యాటింగ్.. అయ్యర్ అరంగేట్రం! తెలుగు ఆటగాడికి దక్కని చోటు!!
Also read: IPL 2022 auction: ధోనీ మరో మూడేళ్లపాటు CSK కే సొంతం ?
ధావన్‌ను వదులుకోనున్న ఢిల్లీ క్యాపిటల్స్?
శిఖర్ ధావన్‌ను రిటైన్ చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals) జట్టు యాజమాన్యం సిద్ధంగా లేదని తెలుస్తోంది. టీమ్‌లో రిషబ్ పంత్, పృథ్వి షా, అక్షర్ పటెల్లతో పాటు ఫారిన్ ప్లేయర్ కగిసో రబాడాలను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే జాబితా రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే గత రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అత్యధిక స్కోరర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) కావడం విశేషం.
ధావన్‌తో పాటు.. ఆ జట్టులో స్టార్ ప్లేయర్స్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్ వంటి వాళ్లను కూడా వదులుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దమైనట్లు తెలుస్తోంది.
రిటైన్ ప్లేయర్ల్ జాబితాను సమర్పించేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైంజీలకు ఈ నెల 30 వరకే అవకాశముంది.
కెప్టెన్‌గా ధావన్..
అయితే శిఖర్ ధావన్‌ను ఢిల్లీ రిటైన్ చేసుకోకుంటే.. పలు ఫ్రాంచైజీలు అతడి మెగా వేలంలో తీసుకునేందుకు పోటీ పడొచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా అతడికి జట్టు సారథ్య బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ విషయాలన్నింటిపై పూర్తి క్లారిటీ రావాలంటే.. మెగా వేలం పూర్తయ్యే వరకు ఆగాల్సిందే.
Also read: Rahul Dravid Bowling Video: నెట్స్‌లో చెమటోడ్చిన ద్రవిడ్.. బౌలింగ్ మాములుగా లేదుగా (వీడియో)!!
Also read: IND Vs NZ: ఆ యువ ఆటగాడు ఉన్నాడు.. రాహుల్ లేని ప్రభావం జట్టుపై ఉండదు: రహానే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook