IPL Mumbai Vs Delhi: ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చతికిలపడింది. ఐదు వికెట్ల తేడాతో ముంబైపై ఓడి ఇంటి దారి పట్టింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి ప్లేఆఫ్స్ రేసులో బెంగళూరుకు లైన్ క్లియర్ చేసినట్లయింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచి ఉంటే బెంగళూరు ఇంటి దారి పట్టేది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిగా ముంబై-ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లో రోవ్‌మన్ పావెల్ 4 సిక్సులు, 1 ఫోర్‌తో 43 (34) పరుగులు బాది జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ పంత్ 39 పరుగులతో రాణించగా పృథ్వీ షా 24 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టి ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలకంగా వ్యవహరించాడు.


ఢిల్లీ ఇన్నింగ్స్ తర్వాత 160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్‌ ఐదో ఓవర్‌లో రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 13 బంతులు ఆడిన రోహిత్ కేవలం రెండు పరుగులే చేయడం గమనార్హం. ఇషాన్ కిషన్ (48), బ్రేవిస్ (37), టిమ్ డేవిడ్ (34) పరుగులతో రాణించడంతో ముంబై విజయం సాధించింది. చివరి ఓవర్‌లో ముంబై గెలుపుకు ఐదు పరుగులు అవసరం కాగా.. ఖలీల్ అహ్మద్ వేసిన మొదటి బంతి నో బాల్‌ అయింది. ఆ తర్వాతి బంతికి రమణదీప్ సింగ్ బౌండరీ బాదడంతో ముంబై 7 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ముంబై ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి ఔట్ అవగా... వెళ్తూ వెళ్తూ ఢిల్లీని కూడా ఇంటి బాట పట్టించింది. 


ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచి ఉంటే బెంగళూరు ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్ అయ్యేది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ ఆ జట్టు నెట్ రన్ రేటు మైనస్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచి ఉంటే నెట్ రన్ రేట్ ఈక్వేషన్‌తో బెంగళూరును వెనక్కి నెట్టి ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై అయ్యేది. కానీ ఢిల్లీకి అదృష్టం కలిసిరాలేదు. 


Also Read: Bigg Boss Telugu OTT Winner: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజేత బిందు మాధవి... టైటిల్‌ను ఎవరికి అంకితం ఇచ్చిందంటే...   


Also Read: Also Read: Vijay Deverakonda: విజయ్‌తో రొమాన్స్ చేయాలనుంది... మనసులో మాట బయటపెట్టిన స్టార్ హీరోయి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.