DD vs MI Live Cricket Score: డేర్ డెవిల్స్‌పై ఆదిలోనే పట్టు సాధించిన ముంబై ఇండియన్స్
వేర్వేరు అనుభవాలు కలిగిన ఈ రెండు జట్లు తలపడుతున్న ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరించనుందో
ఐపీఎల్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేడు జరగనున్న 9వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టుపై టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కెప్టేన్ గౌతం గంభీర్ ఫీల్డింగ్‌కే మొగ్గు చూపుతూ ఆతిథ్య జట్టుని బ్యాటింగ్‌కి ఆహ్వానించాడు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు తరుపున సూర్య కుమార్ యాదవ్, ఎవిన్ లెవిస్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. తొలి 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్ 20 బంతుల్లో 41 పరుగులు( 4X7, 6X1), ఎవిన్ 16 బంతుల్లో 37 పరుగులు ( 4X3, 6X3) తో ముంబై ఇండియన్స్ జట్టు స్కోరు బోర్డుని 84 పరుగులకు చేర్చారు. రన్ రేటు సైతం 14గా వద్ద కొనసాగుతోంది. సొంత గడ్డపైనే మ్యాచ్ జరుగుతున్నప్పటికీ.. ముంబై ఇండియన్స్‌కి ఈ ఆట పూర్తి ఫేవరబుల్‌గా వుంటుందని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్‌లో వాంఖడే స్టేడియంలో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత మరో మ్యాచ్‌లో చివరి బంతితో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
Click here for MI vs DD Live Cricket Score updates
ఇక ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు విషయానికొస్తే, ఈ ఐపీఎల్ సీజన్‌లో వారికి కూడా శుభారంభం ఏమీ లేదు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు చేతిలో ఓటమిపాలైన జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్. ఆ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అత్యల్ప బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసి, ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయినప్పటికీ అదేమీ ఆ మ్యాచ్ ఫలితాన్ని మార్చలేకపోయింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ చేతిలో 10 పరుగుల తేడాతో ( వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో) ఓటమి పాలైంది. ఇలా వేర్వేరు అనుభవాలు కలిగిన ఈ రెండు జట్లు తలపడుతున్న ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరించనుందో వేచిచూడాల్సిందే మరి.