Dhoni Jharkhand Election: ఐపీఎల్ ముగిసిన తర్వాత ఎలక్షన్ డ్యూటీలో మహేంద్ర సింగ్ ధోనీ?
Dhoni Jharkhand Election: ఐపీఎల్ ముగిసిన తర్వాత సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ జార్ఖండ్ రాజధాని రాంచీకి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ధోనీ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన ఓ పిక్ కూడా వైరల్ గా మారింది.
Dhoni Jharkhand Election: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ నిరాశాజనక ఆటతీరుతో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్ లో కొన్ని మ్యాచ్ ల తర్వాత ధోనీ తన కెప్టెన్సీని రవీంద్ర జడేజాకు అప్పగించినా.. ఆ తర్వాత మళ్లీ ఎంఎస్ ధోనీకి సీఎస్కే పగ్గాలను అప్పగించారు. కానీ, ఈ సీజన్ లో CSK పేలవమైన ఆటతో రాణించలేకపోయింది. లీగ్ దశలో ఎక్కువ మ్యాచ్ ల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తద్వారా ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 9వ స్థానానికి చేరుకుంది.
అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత ఎంఎస్ ధోనీ తన స్వస్థలమైన ఝార్ఖండ్ లోని రాంచీకి చేరుకున్నాడు. ప్రస్తుతం జార్ఖండ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ధోనీ ఎన్నికల విధుల్లో భారీగా పాల్గొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి అనుబంధంగా సోషల్ నెట్‌వర్క్‌లో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి ధోనిలా కనిపిస్తున్నాడు. అతడ్ని అభిమానులు ధోనీ అని అంటున్నారు. కానీ అది నిజం కాదు.
ఎంఎస్ ధోనీ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నట్టు చెబుతున్న ఫోటో సర్వత్రా వైరల్‌గా మారింది. అయితే ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ధోనీ కాదు. అతని పేరు వివేక్ కుమార్. సీసీఎల్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల విధుల్లో నిమగ్నమై కౌంటింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. అతను ధోనిలా కనిపిస్తున్నాడు. అతని ఫోటోను ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అభిమానులు కాస్త అయోమయంలో పడి ఐపీఎల్ తర్వాత ధోనీ ఎన్నికల డ్యూటీలో పాల్గొన్నాడా అని ఆశ్చర్యపోతున్నారు.
IPL-2023లో ఆడనున్న ధోనీ
ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ తమ చివరి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో ఆడింది. మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. 'ఇది నా చివరి గేమ్ కాద'ని స్పష్టం చేశాడు. చెన్నైలో తన అభిమానుల మధ్య ఐపీఎల్ లో చివరి మ్యాచ్ ఆడతానని ఆయన తెలిపాడు. దీంతో మళ్లీ కెప్టెన్ కూల్‌ను చూసే అవకాశం అభిమానులకు కలుగుతుంది.
Also Read: Jos Buttler Record: ఐపీఎల్-2022లో బట్లర్ జోరు..మరో రికార్డు బద్ధలు..!
Also REad: Virat Kohli Shock: విరాట్ కోహ్లీ కోసం మైదానంలోకి అభిమాని.. పోలీస్ చేసిన పనికి షాకైన కోహ్లీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook