Jos Buttler Record: ఐపీఎల్-2022లో బట్లర్ జోరు..మరో రికార్డు బద్ధలు..!

Jos Buttler Record: ఐపీఎల్‌-2022 చివరి అంకానికి చేరుకుంది. రేపటితో విజేత ఎవరో తేలనుంది. 

Written by - Alla Swamy | Last Updated : May 28, 2022, 01:59 PM IST
  • చివరి దశకు ఐపీఎల్‌-2022
  • రేపే ఫైనల్ మ్యాచ్
  • బట్లర్ ఖాతాలోకి మరో రికార్డు
Jos Buttler Record: ఐపీఎల్-2022లో బట్లర్ జోరు..మరో రికార్డు బద్ధలు..!

Jos Buttler Record: ఐపీఎల్‌-2022 చివరి అంకానికి చేరుకుంది. రేపటితో విజేత ఎవరో తేలనుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో గుజరాత్‌,రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఈజట్లు  క్వాలిఫైయర్-1లో తలపడ్డాయి. ఇందులో గెలిచి జీటీ టీమ్‌ గెలిచి ఫైనల్‌కు దూసుకుళ్లింది. క్వాలిఫైయర్-2లో బెంగళూర్‌పై రాజస్థాన్‌ విజయం ఢంకా మోగించింది. రేపటి పోరు ఆసక్తికరంగా సాగనుంది.

ఇక ఐపీఎల్‌లో రాజస్థాన్‌ ఆటగాడు బట్లర్‌ జోరు కొనసాగుతోంది. తనదైన ఆట తీరుతో అందర్నీ అలరిస్తున్నాడు. జట్టుకు సైతం కీలక విజయాలను అందిస్తున్నాడు. ఇప్పటివరకు ఈసీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 824 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 116 పరుగులుగా ఉంది. ఇందులో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. మొత్తం 78 ఫోర్లు, 45 సిక్సర్లు బాదాడు.

నిన్న క్వాలిఫైయర్-2లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ వీరవిహారం చేశాడు. సెంచరీ చేయడం ద్వారా జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఈమ్యాచ్‌లో 60 బంతులు ఎదుర్కోని 106 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఈ శతకం ద్వారా ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సాధించాడు. క్వాష్‌ రిచ్‌ లీగ్ ప్లే ఆఫ్స్‌లో సెంచరీ సాధించిన ఆరో ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. 

క్వాలిఫైయర్-2లో సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్, మురళీవిజయ్ తర్వాత బట్లర్ నిలిచాడు. 2014 క్వాలిఫైయర్-2లో చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్‌ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ 122 పరుగులు చేశాడు. 2012 క్వాలిఫైయర్-2లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ప్లేయర్ మురళీ విజయ్ 113 పరుగులు సాధించింది. ఆతర్వాత స్థానంలో బట్లర్ నిలిచాడు.

ఐపీఎల్‌ ఫైనల్‌లో చెన్నై తరపున సెంచరీ సాధించిన ఆటగాడిగా షేన్ వాట్సాన్ ఉన్నాడు. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 117 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత 2014లో కోల్‌కతా జరిగిన ఫైనల్ పోరులో పంజాబ్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా 115 పరుగులు చేశాడు. ఐపీఎల్-2022 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ప్లేయర్‌గా బెంగళూరు ఆటగాడు రజత్ పాటిదార్‌ నిలిచాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 112 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తంగా ఈసీజన్‌లో మరో మ్యాచ్‌ ఉండటంతో మరిన్ని రికార్డు బద్దలు కానున్నాయి.

Also read:Mosquito Repellent: దోమల బెడద ఉందా..మీ ఇంటి చుట్టూ 5 రకాల మొక్కలను నాటండి..!!

Also read:ROJA COMMENTS: బాలకృష్ణను మోసం చేసి చంద్రబాబు సీఎం అయ్యారు! మంత్రి రోజా సంచలన ఆరోపణలు..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News