Virat Kohli Shock: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే క్వాలిఫయర్ -1, ఎలిమినేటర్ మ్యాచ్ లు ముగిశాయి. క్వాలిఫయర్ - 1 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ పై గెలిచిన గుజరాత్ టైటాన్స్ సరాసరి ఫైనల్ కు చేరగా.. ఎలిమినేటర్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కు మరో అడుగు దూరంలో ఉంది. అంటే నేడు (మే 27) జరగనున్న క్వాలిఫయర్ - 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై నెగ్గితే ఆర్సీబీ ఫైనల్ కు చేరుతుంది.
అయితే అంతకు ముందు ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని కలిసేందుకు ఓ అభిమాని మైదానంలోకి దూసుకుంటూ వచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో జరిగిన ఈ సంఘటన వల్ల ఆటకు కొంతసేపు అంతరాయం కలిగింది. విరాట్ కోహ్లీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో అతని అభిమాని కలిసేందుకు మైదానంలోకి వచ్చాడు.
When the intruder towards Virat Kohli at Eden Gardens - VK couldn't control his laugh seeing policeman's reaction 😂 pic.twitter.com/Ctvw8fU4uy
— sohom ᱬ (@AwaaraHoon) May 26, 2022
అయితే ఆ అభిమానిని ఆపేందుకు గ్రౌండ్ స్టాఫ్ సహా కోల్ కతా పోలీసులు అతడ్ని వెంబడించి పట్టుకున్నారు. అభిమాని తన దగ్గరకు వస్తున్న క్రమంలో విరాట్ కోహ్లీ కొంత కంగారుకు లోనయ్యాడు. ఎందుకంటే ఒకవేళ ఆ ఫ్యాన్ విరాట్ కోహ్లీని కలిస్తే.. అతడు బయోబబుల్ నుంచి కొన్ని రోజుల పాటు దూరం అవ్వాల్సి ఉంటుంది. ఆ భయంతో కోహ్లీ కొంతసేపు భయానికి లోనయ్యాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని పోలీసు భుజాన ఎత్తుకొని తీసుకెళ్లిన విధానానికి కోహ్లీ నవ్వుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: Gautam Gambhir Post: ఎలిమినేటర్‌లో ఓడిన లక్నో.. వైరల్‌గా మారిన గౌతమ్ గంభీర్ ఎమోషనల్ పోస్ట్!
Also Read: Rajat Patidar Marriage: ఐపీఎల్ 2022 కోసం.. పెళ్లి వద్దనుకున్న బెంగళూరు ఆటగాడు రజత్ పటీదార్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook