ఎం.ఎస్. ధోని, విరాట్ కోహ్లీల మైత్రి గురించి ప్రత్యేకంగా చేనక్కర్లేదు. వారిద్దరి మధ్య గౌరవప్రదమైన స్నేహం ఉంది. సీనియారిటీ, జూనియారిటీ అనే తేడా లేకుండా ఇద్దరూ ఎటువంటి బేధాభిప్రాయాలు లేకుండా స్నేహంగా ఉంటారు. ఇందుకు ఒక ఉదాహరణ.. ఎం ఎస్ ధోని - "తనకంటే కోహ్లీ ఎక్కువ మ్యాచులు ఆడి, టీమిండియాకు విజయాలు అందించాలని ఆకాంక్షిస్తున్నా.. "అని ఒక సందర్భంలో అనడం, అలానే విరాట్ కోహ్లీ కూడా "ధోనీ తన ముందుతరం క్రికెటర్ల నుంచి ఎంతో నేర్చుకున్నారని, ఆయన ఎప్పటికీ కెప్టెన్" అని గౌరవించడం నిజంగా వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ స్నేహానికి గుర్తుగా దేశ ఆర్ధిక రాజధాని ముంబై కాండీవలి ఈస్ట్ లో 'ధోని-కోహ్లీ' పేరుతో ఒక రెస్టారెంట్ వెలిసింది. అయితే దీనిని వారు పెట్టలేదు. వారిమీదున్న అభిమానంతో ఈ రెస్టారెంట్ ను ఒకరు ప్రారంభించారు. అంతేకాకుండా వారికున్న పాపులారిటీని క్యాష్ చేసుకొనేలా ఈ రెస్టారెంట్‌ యజమానులు నిర్ణయించారు. కాగా ఈ రెస్టారెంట్‌కు సంబంధించిన ఫొటోలను ప్రముఖ క్రికెట్‌ విశ్లేషకుడు మోహన్‌దాస్‌ మేనన్‌ ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.