Asia Cup 2023: ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఎవరో తెలుసా..?
ఆగస్టు 31 నుండి ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా మొదటగా శ్రీలంక - పాకిస్థాన్‌ల మధ్య ప్రారంభం కానున్న విషం మన అందరికి తెలిసందే. ఇందులో 6 జట్లు పాల్గొంటుండగా.. ఈ మెగా ఈవెంట్ లో అత్యధిక పరుగులు చేసిన అతగాడు ఎవరో తెలుసా..?
Asia Cup 2023: ఆసియా కప్.. మన ఖండానికి ప్రతిష్టాత్మకమే అని చెప్పాలి. ఆసియా కప్ లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ టీమ్స్ ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఆగస్టు 31న ప్రారంభమై.. సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. నిజానికి ఈ పూర్తీ టోర్నమెంట్ పాకిస్థాన్ లో జరగాల్సి ఉంది, కానీ భద్రతా కారణాల దృష్ట్యా.. ఈ సారి ఆసియా కప్ రెండు దేశాల్లో నిర్వహించనున్నారు. ఫైనల్ సహా 9 మ్యాచ్ లు శ్రీలంకలో.. మిగతా 4 మ్యాచ్ లు పాకిస్థాన్ లో జరగనున్నాయి.
ఇప్పటి వరకు జరిగిన ఆసియా కప్ లలో అత్యధికంగా 7 సార్లు ఇండియా గెలవగా.. 15 ఎడిషన్ లలో ఆడిన శ్రీలంక 6 సార్లు కప్ గెలిచింది. అయితే.. ఆసియా కప్ లో ఇప్పటి వరకి అత్యధిక పరుగులు చేసింది ఎవరంటే మాత్రం.. అది సచిన్ టెండూల్కర్, ఇంజమామ్-ఉల్-హక్, సయీద్ అన్వర్, కుమార్ సంగక్కర లేదా సౌరవ్ గంగూలీనో కాదు. నిజానికి ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి మోడర్న్ దిగ్గజాలు కూడా కాదు.
ఇక విషయానికి వస్తే.. ఆసియా కప్ టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు మాత్రం.. శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య. లంక టీమ్ కు చెందిన టాప్ ఆర్డర్ బ్యాటర్ జయసూర్య ఇప్పటి వరకు 24 ఇన్నింగ్స్ ఆడి.. మొత్తంగా 1,220 పరుగులు చేశాడు. అంతేకాకుండా 53.04 సగటుతో, 102.52 స్ట్రైక్ రేట్‌తో ఈ ఘనత సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఆసియా కప్ మెగా టోర్నీలో అత్యధిక పరుగుల విషయానికి వస్తే రెండో ఆటగాడు కూడా శ్రీలంక దేశస్థుడు అవ్వటం విశేషం. అతడే.. మాజీ దిగ్గజం కుమార సంగక్కర. కుమారా సంగక్కర 23 ఇన్నింగ్స్ లో 1,075 పరుగులు చేసి ఆసియా కప్ టోర్నీలో రెండో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. తరువాత 3వ స్థానంలో టీమ్ ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. ఈ టోర్నీలో 21 ఇన్నింగ్స్ ఆడిన సచిన్.. 971 పరుగులు చేసాడు.
Also Read: గుడ్‌న్యూస్.. జియో సినిమాస్ లో ఫ్రీగా భారత్ వర్సెస్ వెస్టిండీస్ సిరీస్..
ఆసియా కప్ టాప్ 5 అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో పాకిస్థాన్ జట్టు నుండి ఒకరు మాత్రమే ఉండటం విశేషం, అది కూడా షోయబ్ మాలిక్.. 15 ఇన్నింగ్స్‌లు ఆడిన షోయబ్ 786 పరుగులు చేసాడు. ఇక టాప్ 5 స్కోర్ లిస్ట్ లో రోషిత్ శర్మకి కూడా చోటు దక్కింది. ఈ మెగా టోర్నీలో 21 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 754 పరుగులు చేసాడు.
ఇక మన కింగ్ కోహ్లీ విషయానికి వస్తే.. 10 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. 61.30 సగటుతో 613 పరుగులు చేశాడు. అయినప్పటీకి.. ఆసియా కప్ టాప్ 10 అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లీ లేకపోవటం గమనార్హం. మన మహేంద్రసింగ్ ధోని ఆడిన 16 ఇన్నింగ్స్ లో 648 పరుగులు చేసి 9వ స్థానంలో ఉన్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే.. జయసూర్య రికార్డ్ ను చెరిపేయటానికి అవకాశం ఉన్న ఆటగాడు.. రోహిత్ శర్మ. జయసూర్య రికార్డ్ ను అధిగమించాలంటే రోహిత్ ఇంకా 476 పరుగులు చేస్తే చాలు.. ఆసియా కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 1 ఆటగాడిగా రికార్డుకెక్కనున్నాడు. ఈ సారి ఇది నెరవేరుతుందో లేదో చూడాలంటే టోర్నమెంట్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే!
Also Read: World Cup 2023: స్కాట్లాండ్ చేతిలో ఓటమి.. వరల్డ్ కప్ రేసు నుంచి జింబాబ్వే ఔట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి