Dubai Tennis Championships : దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ సెమిస్లో సానియా జోడీ ఓటమి
Dubai Tennis Championships: దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ లో భాగంగా జరిగిన సెమీస్ లో సానియా జోడీ ఇంటిదారి పట్టింది. ఒస్టాపెంకో- కిచెనోక్ జోడీ చేతిలో పరాజయం పాలైంది.
Dubai Tennis Championships: దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ (Dubai Tennis Championships) సెమీఫైనల్లో సానియా జోడీకి చుక్కెదురైంది. మహిళల డబుల్స్ సెమీస్ లో సానియా మిర్జా-లూసీ హ్రడెకా జోడి..ఒస్టాపెంకో-కిచెనోక్ జోడీ చేతిలో ఓడిపోయింది. ఒక గంట 11 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో 6-2, 2-6, 10-7తో సానియా జోడీ పరాజయం పాలైంది. శనివారం జరిగే దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ డబుల్స్ ఫైనల్‌లో ఒస్టాపెంకో-కిచెనోక్ జోడీ.. రెండో సీడ్ ఎలిస్ మెర్టెన్స్ -వెరోనికా కుడెర్మెటోవా ద్వయంతో తలపడనున్నారు.
ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్ గెలిచిన సానియా మీర్జా (Sania Mirza) మరియు లూసీ హ్రడెకా (Lucie Hradecka) డబ్యూటీఏ-500 ఈవెంట్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టారు. 16వ రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన చాన్ హావో-చింగ్ పై గెలుపొందారు. క్వార్టర్ ఫైనల్‌లో షుకో అయోమా-అలెక్సాండ్రా క్రూనిక్‌లపై సానియా జోడీ విజయం సాధించారు. సానియా మీర్జా ఫిబ్రవరి 25 నుంచి దోహా ఓపెన్‌లో పాల్గొననుంది. ఈ సీజన్ తర్వాత ఆటకు ముగింపు పలకబోతున్నట్లు ఈ ఏడాది జనవరిలో సానియా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read: Ranji Trophy World Record: తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ, ప్రపంచంలోనే రికార్డు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook