Dwayne Bravo becomes first bowler to take 600 wickets in T20 format: వెస్టిండీస్ మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ డ్వేన్‌ బ్రావో టీ20 ఫార్మాట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా బ్రావో చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. 'ది హండ్రెడ్‌' లీగ్ 2022లో గురువారం ఓవల్ ఇన్‌విన్సిబుల్స్‌పై  రెండు వికెట్లు తీసిన బ్రావో.. ఈ అపూర్వమైన ఫీట్ సాధించాడు. ఇప్పటివరకూ ఎవరికీ సాధ్యం కాని ఘనత విండీస్ ప్లేయర్ తన ఖాతాలో వేసుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డ్వేన్‌ బ్రావో టీ20 ప్రపంచకప్‌ 2021 సమయంలో వెస్టిండీస్ జట్టుకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే స్టార్‌ ఆల్‌రౌండర్‌ అయిన బ్రావోకు ప్రపంచ వ్యాప్తంగా పలు లీగుల్లో మంచి డిమాండ్ ఉంది. ఐపీఎల్ 2022 ఆడిన బ్రావో..ప్రస్తుతం ‘ది హండ్రెడ్‌’ లీగ్‌ 2022లోనూ ఆడుతున్నాడు. నార్తన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ జట్టుకు ఆడుతున్న బ్రావో గురువారం రాత్రి ఓవల్‌ ఇన్విజిబుల్స్‌ జట్టుతో తలపడిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి ఈ రికార్డు నెలకొల్పాడు. రిలీ రొస్సౌ (48)ను ఎల్బీడబ్ల్యూగా ఔట్‌ చేసిన బ్రావో.. ఆపై సామ్‌ కరన్‌ (60)ను బౌల్డ్‌ చేశాడు. దాంతో టీ20 క్రికెట్‌లో 600 వికెట్ అతడి ఖాతాలో చేరింది. 



2006లో న్యూజిలాండ్‌పై తొలి టీ20 మ్యాచ్‌ ఆడిన డ్వేన్‌ బ్రావో మొత్తం 91 అంతర్జాతీయ టీ20ల్లో 78 వికెట్లు పడగొట్టాడు. మిగతా 522 వికెట్లు పలు లీగుల్లో తీశాడు. ఐపీఎల్‌లోనూ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా విండీస్ వీరుడు రికార్డుల్లోకెక్కాడు. మొత్తం 161 మ్యాచ్‌లు ఆడిన చెన్నై ప్లేయర్ 183 వికెట్లు తీశాడు. టీ20 అరంగేట్రం చేసినప్పటి నుంచి బ్రావో 25 కంటే ఎక్కువ జట్లలో భాగమయ్యాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో బ్రావో తర్వాత అఫ్గానిస్థాన్‌ స్టార్ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఉన్నాడు. రషీద్‌ 339 మ్యాచ్‌ల్లో 466 వికెట్లు పడగొట్టాడు.


Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ.6799 ధరకే ఇన్‌ఫినిక్స్‌ స్మార్ట్ 6 HD ఫోన్‌! 5000mAh బ్యాటరీ


Also Read: Jagan Govt: రోడ్ల పక్కన ఇళ్ల నిర్మాణంపై అదనపు ట్యాక్స్.. జగన్ సర్కార్ మరో బాదుడు.. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook