Emma Raducanu wins US Open 2021: యూఎస్‌ ఓపెన్‌ మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌(Us Open 2021)లో సరికొత్త సంచలనం నమోదైంది. దిగ్గజాలను మట్టికరిపించి ఇద్దరు అన్‌సీడెడ్‌ క్రీడాకారిణులు బరిలోకి దిగిన ఫైనల్‌ పోరులో 18 ఏళ్ల బ్రిటిష్‌ యువకెరటం ఎమ్మా రదుకాను(Emma Raducanu) చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో కెనాడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్న తొలి క్వాలిఫైయర్‌గా రదుకాను చరిత్ర తిరగరాసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

44ఏళ్ల తర్వాత..


150 ర్యాంక్‌లో ఉన్న ఎమ్మా.. తనకన్నా మెరుగైన 73వ ర్యాంక్‌ క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్‌(Leylah Fernandez)ను ఓడించింది. దీంతో 44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుచుకున్న బ్రిటన్‌ మహిళగా ఘనమైన రికార్డును ఎమ్మా నెలకొల్పింది. బ్రిటన్‌ తరఫున 1977లో వర్జీనియా వేడ్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుపొందింది.  


Also Read: US Open 2021: యూఎస్‌ ఓపెన్‌లో బ్రిటిష్ క్రీడాకారిణి సంచలనం..ఫైనల్‌కు దూసుకెళ్లిన ఎమ్మా


మ్యాచ్ విషయానికొస్తే...


అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఎమ్మా(Emma Raducanu) మొదటి నుంచి లెలాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఎక్కడా కూడా భారీ తప్పిదాలు చేయకుండా మొదటి సెట్‌ను 6-4 తేడాతో గెలిచింది. మొదటి సెట్‌ను గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఆడిన ఎమ్మా ఇక రెండో సెట్‌లో ప్రత్యర్థికి చుక్కలు చూపించింది. 6-3 తేడాతో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌(Grandslam Title)ను ఎగురేసుకుపోయింది. 


ఎమ్మా టోర్నీ ఆసాంతం ఒక్క సెట్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ టోర్నీలో తాను ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక్క సెట్‌ను కూడా కోల్పోలేదు. ఇక టైటిల్‌ గెలిచిన ఎమ్మా 2.5 మిలయన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఒక్కసారిగా ఆమె ర్యాంకు 150 నుంచి 23కు చేరింది. దీంతో ప్రస్తుతం బ్రిటన్‌(Britain‌)లో తనే నంబర్‌ వన్‌ క్రీడాకారిణి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook