Aakash Chopra predicts England win 1st T20 against India: ఇంగ్లండ్ రీషెడ్యూల్ టెస్ట్ మ్యాచ్‌లో ఊరించి ఊసురుమనిపించిన భారత జట్టు టీ20 సిరీస్‌కు సిద్దమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా మరికొద్ది సేపట్లో ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. టెస్ట్ సిరీస్ చేతికి అందినట్టే అంది చేజారడంతో.. కనీసం పొట్టి  సిరీస్‌ను అయినా పట్టాలని రోహిత్ సేన చూస్తోంది. అయితే ఈ మ్యాచులో ఇంగ్లండ్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్‌ చోప్రా జోస్యం చెప్పాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆకాష్‌ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'ఈ మ్యాచులో జోస్ బట్లర్, డేవిడ్ మలన్ కలిసి 75 కంటే ఎక్కువ పరుగులు చేస్తారని నేను భావిస్తున్నాను. ప్రస్తుతానికి ఇంగ్లండ్ విజయ శాతం 50-50 అయినప్పటికీ.. మీరు గత ఐదు మ్యాచ్‌లను పరిశీలిస్తే వారు రెండు మాత్రమే ఓడిపోయారు. ఈ మ్యాచ్‌ల్లో బట్లర్‌ ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. మలాన్‌ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి టీ20లో కూడా ఈ ఇద్దరు పరుగులు చేస్తారు' అని అన్నాడు. 


'రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్ యాదవ్ 70 కంటే ఎక్కువ పరుగులు చేస్తారు. అయితే మూడో స్థానంలో శాంసన్‌ లేదా దీపక్ హుడాలో ఎవరికీ చోటు దక్కుతుందో చుడాలి. రెండు జట్లును పోల్చితే తొలి టీ20లో భారత్‌పై ఇంగ్లండ్‌ విజయం సాధించే అవకాశం ఉంది. బౌలిం‍గ్‌ పరంగా భారత్‌ పటిష్టంగా ఉన్నా.. బ్యాటింగ్‌ పరంగా ఇంగ్లండ్‌ పటిష్టంగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుస్తుందని నేను భావిస్తున్నాను' అని ఆకాష్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. చోప్రా టీమిండియా ప్లేయింగ్ లెవెన్‌ను కూడా ప్రకటించాడు.


ఆకాష్‌ చోప్రా ప్లేయింగ్ లెవెన్‌:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, యుజువేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్.  


Also Read: Sammathame OTT: అప్పుడే ఓటీటీకి 'సమ్మతమే'.. స్ట్రీమింగ్‌ ఎ‍ప్పుడు, ఎక్కడో తెలుసా?


Also Read: Som Pradosh Vrat 2022: సోమ ప్రదోష వ్రతం ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook