Sammathame OTT: అప్పుడే ఓటీటీకి 'సమ్మతమే'.. స్ట్రీమింగ్‌ ఎ‍ప్పుడు, ఎక్కడో తెలుసా?

Sammathame Movie to release on Aha Video. స‌మ్మ‌త‌మే చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా'లో స‌మ్మ‌త‌మే సినిమా విడుదల కాబోతోంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 7, 2022, 04:49 PM IST
  • అప్పుడే ఓటీటీకి సమ్మతమే
  • సమ్మతమే స్ట్రీమింగ్‌ ఎ‍ప్పుడు, ఎక్కడో తెలుసా?
  • జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు
Sammathame OTT: అప్పుడే ఓటీటీకి 'సమ్మతమే'.. స్ట్రీమింగ్‌ ఎ‍ప్పుడు, ఎక్కడో తెలుసా?

Kiran Abbavaram Sammathame Movie to release on Aha Video: 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమాతో హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం తాజాగా 'స‌మ్మ‌త‌మే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోపీనాథ్ రెడ్డి దర్శకునిగా పరిచయం అయిన ఈ సినిమాను యు.జి ప్రొడక్షన్స్‌ సంస్థపై కంకణాల ప్రవీణ్‌ నిర్మించారు. చాందిని చౌదరి హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకున్న స‌మ్మ‌త‌మే సినిమా పర్వాలేదనిపించింది.

తాజాగా స‌మ్మ‌త‌మే చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా'లో స‌మ్మ‌త‌మే సినిమా విడుదల కాబోతోంది. జూలై 15 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. అయితే థియేటర్లో విడుదలైన రెండు వారాలకే ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతుండడం విశేషం. ఈ విషయం తెలుసుకున్న ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లో  చూడని వారు ఎంచక్కా ఇంట్లోనే చూడనున్నారు. 

స‌మ్మ‌త‌మే సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. విడుద‌లైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. 'ఎస్ఆర్ కళ్యాణమండపం' తర్వాత కిరణ్‌ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడింది. ప్రస్తుతం కిరణ్‌ ఈ సినిమా విజయాన్నిఆస్వాదిస్తున్నాడు. 

Also Read: Biggest Chicken: ప్రపంచంలోనే అతిపెద్ద కోడి.. బరువెంతో తెలుసా! ఎప్పుడూ చూసుండరు

Also Read: Vomiting Problems: తరచుగా జర్నీలో వాంతులతో అవుతున్నాయా.. అయితే ఇలా చేయండి..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News