కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు తేరుకుంది. భారత్‌తో తొలి టీ 20 మ్యాచ్‌లో ఓడిపోయిన ఇంగ్లాండ్ రెండో టీ 20లో విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఐదు వికెట్ల తేడాతో రెండో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (47; 38 బంతుల్లో 1×4, 2×6), ధోని (32 నాటౌట్‌; 24 బంతుల్లో 5×4) రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్, అలెక్స్ హేల్స్ (41 బంతుల్లో 58 పరుగులు) ‌, బెయిర్‌స్టో (28; 18 బంతుల్లో 2×6) రాణించడంతో 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సి ఉండగా.. హేల్స్ తొలి రెండు బంతులకు సిక్స్‌, ఫోర్‌ బాది జట్టును గెలిపించాడు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 2, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా, చాహల్  చెరో వికెట్ తీశారు.  దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. ఆదివారం చివరి టీ20 మ్యాచ్‌ జరుగుతుంది.


భారత్‌: 148/5 (కోహ్లి 47, రైనా 27, ధోని 32 నాటౌట్‌, పాండ్య 12 నాటౌట్‌; విల్లీ 1/18, బాల్‌ 1/44, ప్లంకెట్‌ 1/17, రషీద్‌ 1/29)
ఇంగ్లాండ్‌: 19.4 ఓవర్లలో 149/5 (రాయ్‌ 15, బట్లర్‌ 14, హేల్స్‌ 58 నాటౌట్‌, బెయిర్‌స్టో 28; ఉమేశ్‌ 2/36, కుల్‌దీప్‌ 0/34, చాహల్‌ 1/28)