Jasprit Bumrah Record: ఇంగ్లండ్ గడ్డపై జస్ప్రీత్ బుమ్రా మరో రికార్డు.. ఈసారి భువనేశ్వర్ రికార్డు బ్రేక్!
IND vs ENG: Jasprit Bumrah breaks Bhuvneshwar Kumar record. అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న రికార్డును జస్ప్రీత్ బుమ్రా బద్దలు కొట్టాడు.
Jasprit Bumrah breaks Bhuvneshwar Kumar record: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో ఓ ఓవర్లో అత్యధిక పరుగుల (31) చేసిన రికార్డును ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్న బుమ్రా.. తాజాగా మరో రికార్డును సైతం తన పేరుపై లిఖించుకున్నాడు. ఇంగ్లండ్, భారత్ టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకు 21 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు.
ఐదవ టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా 68 పరుగులిచ్చి 3 వికెట్లు (అలెక్స్ లీస్, జాక్ క్రాలే, ఆలీ పోప్) పడగొట్టాడు. దీంతో ఇప్పటివరకు ఈ సిరీస్‌లో బుమ్రా 21 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఇంగ్లండ్ గడపై టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. 2014లో ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో భువనేశ్వర్ 19 వికెట్లు పడగొట్టాడు. ఇంకా రెండో ఇన్నింగ్స్ ఉన్న నేపథ్యంలో బుమ్రా ఖాతాలో మరిన్ని వికెట్లు చేరే అవకాశముంది.
ఈ జాబితాలో జహీర్ ఖాన్ (2007లో 18 వికెట్లు), ఇషాంత్ శర్మ (2018లో 18 వికెట్లు), సుభాశ్ గుప్తే (1959లో 17 వికెట్లు) తరువాతి స్థానాల్లో ఉన్నారు. సాధారణంగా భారత్ తరఫున అత్యధిక వికెట్ల ఘనత స్పిన్నర్ల పేరుపై ఉంటుంది. అయితే ఇంగ్లండ్‌పై ఓ సిరీస్‌లో అత్యధిక వికెట్లు సాధించిన టాప్-5 జాబితాలో ఒక్కరే స్పిన్నర్ ఉండటం విశేషం. సుభాశ్ గుప్తే ఈ జాబితాలో ఉన్న ఏకైక స్పిన్నర్. అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, ఆర్ అశ్విన్ కూడా వికెట్లు పడగొట్టలేకపోయారు.
ఇంగ్లీష్ గడ్డపై బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా సత్తాచాటడంతో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీ షెడ్యూల్ టెస్టు మ్యాచులో భారత్ మెరుగైన స్థితిలో ఉంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఐదో టెస్టు జరుగుతోన్న ఐదవ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్ప్‌లో మూడో రోజు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసిన భారత్.. ఓవరాల్‌గా 257 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచినా లేదా డ్రా చేసుకున్నా సిరీస్ భారత్ వశం అవుతుంది.
Also Read: Vishal Accident: మరోసారి షూటింగ్లో గాయపడ్డ హీరో విశాల్.. చిత్ర యూనిట్ షాకింగ్ డెసిషన్!
Also Read: iPhone SE 3 Free: ఉచితంగా 5జీ ఐఫోన్.. వెరిజోన్‌లో ఫ్రీగా ఎలా పొందాలో తెలుసా!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook