Tamil Hero Vishal seriously injured at Laththi movie shoot: తమిళ స్టార్ హీరో విశాల్ మరోసారి గాయపడ్డాడు. విశాల్ హీరోగా తెరకెక్కుతున్న 'లాఠీ' సినిమా క్లైమాక్స్ ఫైట్ సీన్స్ కోసం చేసిన షూటింగ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో విశాల్ కాలికి తీవ్ర గాయమైంది. దీంతో ఉన్నపళంగా సినిమా షూటింగ్‌ను చిత్ర యూనిట్ నిలిపివేసింది. విశాల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న లాఠీ సెట్స్‌లో గాయపడడం ఇది రెండోసారి. గతంలో హైదరాబాద్‌లో చిత్రీకరణ సమయంలో ఆయన చేతికి గాయాలు అయ్యాయి.
లాఠీ సినిమా చిత్రీకరణ సమయంలో హైదరాబాద్‌లో స్టంట్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా.. విశాల్ చేతికి, చేతి వేళ్లకు గాయాలు అయ్యాయి. షూటింగ్ ఆపేసి చికిత్స కోసం ఆయన కేరళ వెళ్లారు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించారు. ఆదివారం చివరి షెడ్యూల్‌లో భాగంగా క్లైమాక్స్ ఫైట్ సీన్స్ తెరకెక్కుస్తుండంగా.. విశాల్ మరోసారి ప్రమాదానికి గురయ్యాడు. ఈసారి అతడి కాలికి గాయమైంది. గతంతో పోలిస్తే ఈసారి గాయాలు తీవ్రంగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.
హీరో విశాల్ ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరముందని చిత్ర యూనిట్ వెల్లడించింది. అతనికి గాయాలు పూర్తిగా తగ్గిన తర్వాతే షూటింగ్ తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. ఇక విశాల్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు. ఇలాంటి రిస్క్ షాట్‌లు మరోసారి చేయొద్దని వారు కోరుకుంటున్నారు. విశాల్ తన సినిమాల్లోని యాక్షన్ సీక్వెన్స్ కోసం రిస్క్ చేస్తుంటాడు. ఒకోసారి డూప్ లేకుండా కూడా సాహసం చేస్తాడు.
Actor @VishalKOfficial once again got injured on the sets of #Laththi .
The Night Shoot was cancelled as #Vishal got a leg injury during shoot of climax fight sequence happening at chennai. The shoot will resume once the actor recovers. pic.twitter.com/xnPAx8THHW
— Sreedhar Pillai (@sri50) July 3, 2022
లాఠీ సినిమాలో విశాల్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం అతడు బరువు తగ్గి ఇంకా ఫిట్ అయ్యాడు. ఈ సినిమాకు వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ సరసన సునైనా కథానాయికగా నటిస్తున్నారు. రమణ, నందా ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న లాఠీ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 12న లాఠీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: iPhone SE 3 Free: ఉచితంగా 5జీ ఐఫోన్.. వెరిజోన్‌లో ఫ్రీగా ఎలా పొందాలో తెలుసా!
Also Read: ఫెమినా మిస్ ఇండియాగా సిని శెట్టి.. నాలుగో స్థానంలో తెలంగాణ అమ్మాయి! ప్రత్యేక ఆకర్షణగా మిథాలీ
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook