Ravindra Jadeja joins Kapil Dev And MS Dhoni Elite List: ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టీమిండియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు చెలరేగారు. తొలి రోజు ఆటలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ (146; 111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సులు) అదరగొట్టగా.. రెండో రోజు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (104; 194 బంతుల్లో 13 ఫోర్లు) కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్ మాటి పాట్స్ వేసిన 79వ ఓవర్ చివరి రెండు బంతులకు బౌండరీలు బాదిన జడేజా సెంచరీ మార్క్ అందుకున్నాడు. శతకం అనంతరం తన స్టైల్‌లో బ్యాటును కత్తిలా తిప్పుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. టెస్టుల్లో జడ్డూకి ఇది మూడో సెంచరీ. అయితే సెంచరీ చేసిన కాసేపటికే జడేజా పెవిలియన్ చేరాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో సెంచరీ చేయడంతో రవీంద్ర జడేజా అరుదైన రికార్డు అందుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఒకే క్యాలెండర్‌ ఈయర్‌లో రెండు సెంచరీలు బాదిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు. ఈ జాబితాలో హర్యానా హరికేన్ కపిల్‌ దేవ్‌ (1986), జార్ఖండ్ డైనమేట్ ఎంస్‌ ఎంఎస్ ధోనీ (2009), టర్బోనేటెర్ హర్భజన్ సింగ్ (2010) ఉన్నారు. 2010 తర్వాత టెస్టుల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి రెండు సెంచరీలు బాదడం ఇదే మొదటిసారి. 


మరోవైపు భారత్ తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు 100 పరుగులు చేయడం ఇది మూడోసారి. 1999లో అహ్మదాబాద్ వేదికగా న్యూజీలాండ్ జట్టుతో జరిగిన టెస్టులో ఎస్ రమేష్ (110), సౌరవ్ గంగూలీ (125) సెంచరీలు బాదారు. 2007లో బెంగళూరులో పాకిస్తాన్ టీంతో జరిగిన టెస్టులో సౌరవ్ గంగూలీ (239), యువరాజ్ సింగ్ (169) శతకాలు బాదారు.  తాజాగా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు సెంచరీలు చేశారు. 



ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత భారీ స్కోరు చేసింది. 84.5 ఓవర్లలో 416 రన్స్ చేసింది. ఆరంభంలో 93 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ఏకంగా 400+ రన్స్ చేయడం విశేషం. రిషబ్ పంత్ (146), రవీంద్ర జడేజా (104)లు సెంచరీలు చేయగా.. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (16 బంతుల్లో 31 నాటౌట్) చెలరేగి ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. 


Also Read: క్రిస్ గేల్‌ను కలిసిన టాలీవుడ్ కమెడియన్.. ఎక్కడో తెలుసా?


Also Read: 'పక్కా కమర్షియల్‌' ఫస్ట్‌డే కలెక్షన్స్‌.. గోపీచంద్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook