Dhanraj Meets Gayle: క్రిస్ గేల్‌ను కలిసిన టాలీవుడ్ కమెడియన్.. ఎక్కడో తెలుసా?

Tollywood Comedian Dhanraj meets Chris Gayle.  టాలీవుడ్ కమెడియన్ ధన్‌రాజ్.. కరేబియన్ స్టార్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను కలిశాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 2, 2022, 04:56 PM IST
  • క్రిస్ గేల్‌ను కలిసిన టాలీవుడ్ కమెడియన్
  • సోషల్ మీడియాలో ఫొటో వైరల్
  • 45 ఏళ్ల వరకు క్రికెట్
Dhanraj Meets Gayle: క్రిస్ గేల్‌ను కలిసిన టాలీవుడ్ కమెడియన్.. ఎక్కడో తెలుసా?

Tollywood Comedian Dhanraj meets Chris Gayle: టాలీవుడ్ కమెడియన్ ధన్‌రాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ తన స్టైల్ కామెడీతో అందరిని అలరించాడు. ఇక ఈటీవీ కామెడీ షో 'జబర్దస్త్‌'తో ధన్‌రాజ్ వెలుగులోకి వచ్చాడు. టీమ్ సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. అంచలంచెలుగా ఎదుగుతూ టీమ్ లీడర్ కూడా అయ్యాడు. ఆపై సినిమాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ అయిపోయాడు. 

ధన్‌రాజ్.. బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్‌బాస్' తెలుగు సీజన్ 1 కంటెస్టెంట్‌ కూడా. 41 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగారు. ఆ సీజన్‌లో పదో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రత్యేక షోలు కూడా చేస్తున్నాడు. తాజాగా ధన్‌రాజ్.. కరేబియన్ స్టార్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను కలిశాడు. అంతేకాదు కాసేపు ముచ్చటించి ఓ సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఈ ఫొటోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'హే.. క్రిస్ గేల్‌ ఇక్కడ' అంటూ కొన్ని స్మైలీ ఎమోజీలను కూడా పోస్ట్ చేశాడు. 

ఫొటోలో బ్లూ జీన్స్ ప్యాంట్, బ్లాక్ టీషర్ట్, క్యాప్ పెట్టుకుని క్రిస్ గేల్‌ ఉండగా.. బ్లూ షర్ట్ వేసుకుని ధన్‌రాజ్ స్మైల్ ఇస్తున్నాడు. వాషింగ్టన్ డీసీ కనెక్టికట్‌లో ఉన్న మేఫ్లవర్ హోటల్‌ లాంజ్‌లో గేల్‌ను టాలీవుడ్ కమెడియన్ కలిసినట్లు తెలుస్తోంది. ధన్‌రాజ్ పోస్ట్ చేసిన ఫొటోపై పలువురు నెటిజన్లు స్పందించారు. 'ఎక్కడ కలిశావు' అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి క్రిస్ గేల్‌తో ధన్‌రాజ్ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ధన్‌రాజ్ కమెడియన్‌గానే కాకుండా కొన్ని సినిమాల్లో సీరియస్ రోల్స్‌లోనూ విశ్వరూపం చూపిస్తున్నాడు. ధన్‌రాజ్ లీడ్ రోల్స్‌లో కొన్ని హారర్ మూవీస్‌ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు క్రిస్ గేల్ గతకొంత కాలంగా ఎక్కువగా క్రికెట్ ఆడడం లేదు. ఐపీఎల్ 2022లో యూనివర్సల్ బాస్ ఆడలేదు. అటు జాతీయ జట్టులో కూడా కనబడడం లేదు. 42 ఏళ్ల గేల్ గతంలో 45 ఏళ్ల వరకు క్రికెట్ ఆడుతానని పేర్కొన్నాడు.  

Also Read: 'పక్కా కమర్షియల్‌' ఫస్ట్‌డే కలెక్షన్స్‌.. గోపీచంద్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్!

Alos Read: Rain Alert: ప్రధాని మోడీ సభకు గండం! తెలంగాణకు మూడు రోజుల రెయిన్ అలర్ట్..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News