Sam Northeast scored 410 runs in England County Championship 2022: ఇంగ్లండ్ గడ్డపై జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో బ్యాటర్ సామ్ నార్త్‌ఈస్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. గ్లామోర్గాన్ కౌంటీ జట్టు బ్యాటర్‌ నార్త్ఈస్ట్ ఏకంగా 410 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దాంతో ఫస్ట్‌ క్రాస్ క్రికెట్‌లో 400లకు పైగా పరుగులు చేసిన తొమ్మిదో బ్యాటర్‌గా, తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు 21వ శతాబ్దంలో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 400 ప్లస్ స్కోరు సాధించిన తొలి బ్యాటర్‌గానూ నార్త్ఈస్ట్ రికార్డుల్లోకెక్కాడు. ఈ ఘనతతో ప్రపంచ దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా సరసన అతడు నిలిచాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన జాబితాలో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా మొదటి స్థానంలో ఉన్నాడు. లారా ఏకంగా 501 పరుగులు చేశాడు. సామ్ నార్త్‌ఈస్ట్ 450 బంతుల్లో 45 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 410 పరుగులు చేశాడు. లీస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో భాగంగా శనివారం (జులై 23) నార్త్‌ఈస్ట్‌ ఈ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో చివరి వరకు అతడు నాటౌట్‌గా నిలిచాడు. అయితే మ్యాచ్ చివరి రోజున ఫలితం వస్తుందనుకున్న గ్లామోర్గాన్ కెప్టెన్‌ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో లారా 501 పరుగుల (నాటౌట్) ప్రపంచ రికార్డును నార్త్‌ఈస్ట్ అందుకోలేకపోయాడు.


మ్యాచ్ అనంతరం సామ్ నార్త్‌ఈస్ట్ మాట్లాడుతూ.. 390 పరుగుల వద్ద ఉన్నప్పుడు కంటే 190లలో ఉన్నప్పుడే ఎక్కువ టెన్షన్ పడ్డానని తెలిపాడు. 'నా కెరీర్లో 191 పరుగులే అత్యధిక స్కోరు. దాంతో ఈ మ్యాచ్‌లో నా వ్యక్తిగత స్కోరు 190 వద్ద ఉన్నప్పుడు టెన్షన్ పడ్డాను. 390లలో ఉన్నప్పుడు కూడా అంత టెన్షన్ పడలేదు. దాని గురించి ఇప్పుడు మాట్లాడటం కూడా పూర్తిగా హాస్యాస్పదంగా ఉంది. నేను సాధించాలనుకున్న దాని కంటే రెట్టింపు దక్కింది. ఇది ఎప్పటికీ జరగదని నేను అనుకున్నాను. ఇది ఎల్లప్పుడూ ఆలోచించే విషయమే. సంవత్సరాలుగా నా కోచ్‌లందరూ నాకు చెప్పినట్లుగా ఎన్ని పరుగులు చేసినా సరిపోవు' అని నార్త్‌ఈస్ట్ అన్నాడు.


ఒక ఇన్నింగ్స్‌లో 400+ స్కోరు బ్యాటర్లు వీరే:
# బ్రియాన్ లారా (501 నాటౌట్) – 1994
# హనీఫ్ మహ్మద్ (499)- 1959
# డాన్ బ్రాడ్మన్ (452 నాటౌట్) – 1930
# బి. నింబాల్కర్ (443 నాటౌట్) – 1948 
# బిన్ పోన్స్ఫర్డ్ (437) – 1927
# బిన్ పోన్స్ఫర్డ్ (429) – 1923
# అప్తబ్ బలోచ్ (428) – 1974
# అర్చీ మెక్‌లారెన్ (424)- 1895
# సామ్ నార్త్‌ఈస్ట్ (410 నాటౌట్) – 2022
# గ్రీమ్ హిక్ (405) – 1988
# బ్రియాన్ లారా (400 నాటౌట్) – 2004 


Also Read: పాట పాడుతూ ఆవును ఆటపట్టిందామనుకున్న యువకుడు.. చివరికి ఏమైందో చుడండి! నవ్వు ఆపుకోలేరు


Also Read: PMGKAY: ఏపీలో ఆగస్టు 1 నుంచి ఉచిత రేషన్ పంపిణీ..ఎప్పటి వరకంటే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.