PMGKAY: ఏపీలో ఆగస్టు 1 నుంచి ఉచిత రేషన్ పంపిణీ..ఎప్పటి వరకంటే..!

PMGKAY: ఆగస్టు ఒకటి నుంచి ఏపీలో బృహత్కర కార్యక్రమం అమలు కానుంది. పీఎంజీకేఏవై పథకం కింది ఉచిత రేషన్ అందించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

Written by - Alla Swamy | Last Updated : Jul 24, 2022, 02:56 PM IST
  • ఏపీలో మరో కార్యక్రమం
  • త్వరలో ఉచిత రేషన్ పంపిణీ
  • ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
PMGKAY: ఏపీలో ఆగస్టు 1 నుంచి ఉచిత రేషన్ పంపిణీ..ఎప్పటి వరకంటే..!

PMGKAY: ఏపీలో ఆగస్టు ఒకటి నుంచి ఉచిత రేషన్ పంపిణీ చేయనున్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద పంపిణీ చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ధ్యానసేకరణ జరగాలంటే రేషన్ పంపిణీ చేయాలని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్ స్పష్టం చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వం ..పంపిణీ చేయాలని నిర్ణయించింది. 

ఐతే ఈ బియ్యాన్ని జాతీయ ఆహార భద్రత చట్టం కింద రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఇవ్వనున్నారు. ఏపీలో మొత్తం 1.4 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 88.75 లక్షల మందికి జాతీయ ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. మిగిలిన 56.6 లక్షల మందికి ఉచిత రేషన్ వర్తించదు. మరోవైపు ఏపీలో ఏప్రిల్ నుంచి ఉచిత రేషన్ పంపిణీ జరగడం లేదు. 

దీంతో ఈనెలతో కలుపుకుని మొత్తం ఐదు నెలల రేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇలా చూసుకుంటే ఒక్కో కుటుంబసభ్యుడికి 25 కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఒక కార్డులో నలుగురు ఉంటే ఐదు నెలలు కలుపుకుని వంద కేజీలు పంపిణీ చేయాల్సి ఉంది. మొత్తంగా రూ.4 వేల విలువైన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు పొందనున్నారు. జాతీయ ఆహార భద్రతకార్డు పరిధిలోకి రాని వారు ఈస్కీమ్‌ను నష్టపోనున్నారు. 

ఐతే రాష్ట్రంలో రేషన్ స్టాక్ లేదని..అందుకే విడతల వారిగా పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ చెబుతోంది. జాతీయ ఆహార భద్రత కార్డుదారులకు రేషన్‌పై త్వరలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, బొత్స సత్యనారాయణ రివ్యూ చేయనున్నారు. భేటీ అనంతరం పంపిణీపై క్లారిటీ రానుంది.

Also read:Minister Ktr: ఇవాళ యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ పుట్టిన రోజు..ప్రత్యేక కథనం..!

Also read:Lal Darwaza Bonalu LIVE* Updates: అంగరంగ వైభవంగా లాల్ దర్వాజ, అంబర్‌పేట్ బోనాలు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News