England Cricket Team: ఇంగ్లండ్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టుకు కొత్త సారధి వచ్చాడు. ఆ వివరాలివీ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెస్టిండీస్-ఇంగ్లండ్ టీ20 మ్యాచెస్ జరుగుతున్నాయి. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టు(England Cricket Team) పరాజయాలు మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలో ఆ జట్టులో కీలకమార్పులు జరిగాయి. ముఖ్యంగా నాయకత్వంలో మార్పు వచ్చింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌ల నుంచి తప్పుకున్నాడు. తొండ కడరాల్లో గాయం కారణంగా ఇయాన్ మోర్గాన్ తప్పుకుంటున్నట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. జట్టు నుంచి మోర్గాన్ తప్పుకోవడంతో..మొయిన్ అలీ (Moin Ali) జట్టుకు సారధ్యం వహించనున్నాడు. మొత్తం ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో వెస్టిండీస్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం తరువాత రెండవ మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో గెలిచింది. తిరిగి మూడవ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. రెండు మ్యాచ్‌లలో కూడా మోర్గాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడకపోవడం గమనార్హం. 


Also read: IND vs WI: ప్రాక్టీస్‌ లేకుండా బరిలో దిగడం కష్టం.. టీమిండియాలో అతడి రీఎంట్రీ అంత ఈజీ కాదు: భజ్జీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook