England vs India 2nd ODI, Rohit Sharma shows angry on journalist: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా గురువారం లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49 ఓవర్లల్లో 246 పరుగులకు ఆలౌట్ అయింది. మోయిన్‌ అలీ (47; 64 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లలో యుజ్వేంద్ర చహల్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 38.5 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటై.. 100 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దాంతో సిరీస్‌ 1-1తో సమమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలం అయ్యాడు. మూడో టీ20లో అయిన గాయం కారణంగా తొలి వన్డేలో ఆడని విరాట్.. ఈ మ్యాచ్‌లో 16 పరుగులే చేశాడు. ఎప్పటిలానే ఆఫ్ సైడ్ బలహీనతతో పెవిలియన్ చేరాడు. 25 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 16 పరుగులు చేసిన కోహ్లీ.. డేవిడ్ విల్లే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. విరాట్ మరోసారి తక్కువ పరుగులకే ఔట్ అవ్వడంతో విమర్శల వర్షం కురుస్తోంది. 


మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న కెప్టెన్ రోహిత్ శర్మను ‘ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫామ్ మీదే చర్చ నడుస్తుంది కదా?. మీరేం సమాధానం చెబుతారు అని ఓ పాత్రికేయుడు అడగ్గానే హిట్‌మ్యాన్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ఎన్నిసార్లు సమాధానం చెప్పాలంటూ అసహనానికి గురయ్యాడు. 'విరాట్ కోహ్లీ చాలా మ్యాచ్‌లు ఆడాడు. చాలా సంవత్సరాలుగా ఆడుతున్నాడు. అతనికి ఎలాంటి భరోసా అవసరం లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను.. ప్రతి ఆటగాడికి ఫామ్ లేమి సహజం. కోహ్లీ లాంటి ఆటగాడు తిరిగి ఫామ్‌లోకి రావడానికి కేవలం రెండు ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరం' అని అన్నాడు. 



'విరాట్ కోహ్లీ ఫామ్‌పై చర్చలు ఎప్పుడూ జరుగుతాయి. ఈ విషయం నాకు కూడా తెలుసు. అయితే ప్రతి ఆటగాడు అతని కెరీర్‌లో ఎత్తుపల్లాలను ఎదుర్కొంటాడు. ఈ విషయాన్ని అందరూ గమనించి అర్ధం చేసుకోవాలి. కొన్ని ఇన్నింగ్స్ ఆడనంత మాత్రాన ఆటగాడిలో క్వాలిటీ తగ్గదు కదా. తాను ఆడిన ప్రతి మ్యాచ్‌లో రాణించి ఆటగాడు క్రికెట్ చరిత్రలో లేడు. కోహ్లీ పరుగులు మరియు వన్డేలలో సగటును చూడండి.. అతడు ఎలాంటి ఆటగాడో మీకే తెలుస్తుంది' అని రోహిత్ శర్మ బదులిచ్చాడు. 


Also Read: Cherries For Weight Loss: ఏం చేసిన బరువు తగ్గడం లేదా.. అయితే రోజూ వీటిని తినండి..!
Also Read: Kala Sarp Dosham: కాల సర్ప దోషం లక్షణాలు ఏంటి? దోష నివారణకు ఏం చేయాలి?


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.