Kala Sarp Dosham: కాల సర్ప దోషం లక్షణాలు ఏంటి? దోష నివారణకు ఏం చేయాలి?

Kala Sarp Dosham: మీ జాతకంలో కాల సర్ప దోషం ఉంటే మిమ్మిల్ని అనేక సమస్యలు వెంటాడతాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఈ దోషం నుండి బయటపడటానికి ప్రయత్నించాలి. దీనికి శ్రావణ మాసం ఎంతో ఉత్తమమైనది.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2022, 11:35 AM IST
Kala Sarp Dosham: కాల సర్ప దోషం లక్షణాలు ఏంటి? దోష నివారణకు ఏం చేయాలి?

Kala Sarp Dosham Remedies: మీ జాతకంలో కాలసర్ప దోషం ఉంటే జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది. మీరు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ దోషం నుండి బయటపడటానికి శ్రావణ మాసం (Sravana Masam) ఎంతో ఉత్తమమైనది. ఈ మాసంలో శివారాధన చేస్తే మీకు ఉన్న అన్ని బాధలు, దుఃఖాలు మరియు దోషాలు తొలగిపోతాయి. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం సర్పదోషం (Kala Sarp Dosham) అశుభమైనదిగా భావిస్తారు. ఈ దోషం యెుక్క లక్షణాలు ఎలా గుర్తించాలి, వాటిని వదిలించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం. 

కాలసర్ప దోషం లక్షణాలు
** ఒక వ్యక్తి యొక్క జాతకంలో అన్ని గ్రహాలు రాహు మరియు కేతువుల మధ్య వచ్చినప్పుడు కాల సర్ప దోషం ఏర్పడుతుంది. ఈ దోషం ఉన్న ఎడ్యుకేషన్  కు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా వీరు పనిలో కూడా చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. 
** జాతకంలో కాల సర్ప దోషం ఉన్న  వ్యక్తి చెడు పనుల పట్ల, తప్పుడు వ్యక్తుల పట్ల ఆకర్షితుడై తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు.  వీరి పెళ్లికి సంబంధించి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటారు. సంతానం విషయంలో కూడా సమస్యలు ఎదుర్కొంటారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. 

కాల సర్ప దోషం రకాలు
జ్యోతిషశాస్త్రంలో 12 రకాల కాల సర్ప దోషాలు గురించి చెప్పబడ్డాయి. వీటిలో కొన్ని అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి వ్యక్తుల జీవితాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి ఈ దోషం నుండి వీలైనంత తొందరగా బయటపడాలి. ఇందుకోసం శ్రావణ మాసంలో కాల సర్పదోష నివారణకు చర్యలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితం మెరుగుపడుతుంది. కాల సర్ప దోషాన్ని తొలగించుకోవడానికి అర్హత కలిగిన పండితులు ద్వారా కర్మలు చేయించుకోవాలి. 

Also Read: Shani Dev: శనిదేవుని అనుగ్రహం పొందాలంటే.. ఈ సింపుల్ పరిహారాలు చేయండి!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News