Cherries For Weight Loss: ఉదయం పూట చాలా మంది ఎదో ఒక రకమైన పండును టిఫిన్‌కు ముందు తింటూ ఉంటారు. ముఖ్యంగా చెర్రీలాంటి అధిక పోషకాలున్న ఫ్రూట్‌ను తీసుకుంటారు. ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే గుణాలు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉండడమే కాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో కూడా ఉంటుంది. ఇదిద శరీరంలో అనారోగ్య సమస్యలపై ప్రభావవంతంగా పని చేస్తుంది. చెర్రీస్‌లో ఉండే మూలకాలు కొవ్వును వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది. వీటి వల్ల శరీరానికి లభించే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం.
చెర్రీస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు(Benefits of eating cherries):
బరువు తగ్గడం(Weight loss):
ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి వారు క్రమంత తప్పకుండా చెర్రీస్‌ను తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి అధిక పరిమాణంలో ఉంటాయి. కావున శరీరంలో కొవ్వును చాలా సులభంగా నియంత్రిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటున్న వారు తప్పకుండ ఈ పండును తీసుకోవాలి.
కేలరీలు బర్న్ అవుతాయి(Burn calories):
రోజూ తీసుకునే ఆహారంలో చెర్రీలను తీసుకోవడం వల్ల శరీరంలో కేలరీలు బర్న్ అవుతాయి. అంతేకాకుండా కొవ్వును వేగంగా కరిగించడాని దోహదపడుతుంది. అయితే చెర్రీస్‌లో ఉండే మెలటోనిన్ హార్మోన్ బాగా నిద్రపోయేలా చేస్తుంది.
అధిక రక్తపోటును నియంత్రిస్తుంది (Controls high blood pressure):
చెర్రీస్‌లో అధిక పరిమాణంలో పొటాషియం, తదితర పోషకాలుంటాయి. ఇది శరీరంలో పేరుకు పోయిన సోడియంను తగ్గించడానికి ప్రభావవంతంగా పని చేస్తాయి. శరీరంలో పొటాషియం, సోడియం సమతుల్యంగా ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది(Keeps the heart healthy):
చెర్రీస్‌లో ఉండే ఆంథోసైనిన్స్(Anthocyanins) యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా చెర్రీస్ రక్తపోటును నియంత్రించి.. వాపును తగ్గించడానికి కృషి చేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో ప్రభావవంతంగా పోరాడి హృదయాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook