Coronavirus: న్యూజిలాండ్ జట్టులో ఒకరి తరువాత మరొకరికి కరోనా వైరస్, మూకుమ్మడిగా కోవిడ్ పరీక్షలు
Coronavirus: ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా భయం వెంటాడుతోంది. క్రికెట్ పర్యటనలో ఉన్న జట్లను పట్టి పీడిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టు పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది.
Coronavirus: ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా భయం వెంటాడుతోంది. క్రికెట్ పర్యటనలో ఉన్న జట్లను పట్టి పీడిస్తోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టు పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది.
ఇంగ్లండ్-న్యూజిలాండ్ పర్యటన కొనసాగుతోంది. మరోవైపు కరోనా కల్లోలం భయం రేపుతోంది. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ జట్టును కరోనా వైరస్ వెంటాడుతోంది. జట్టు ఆటగాళ్లను ఒక్కొక్కరికి కరోనా భయం కారణంగా కంటి మీద నిద్రలేకుండా పోతోంది. ఇంగ్లండ్-న్యూజిలాండ్ రెండవ టెస్ట్ సందర్భంగా న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా..ఇప్పుడు మరో స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే కరోనా బారిన పడ్డాడు.
ఇద్దరు జట్టు సభ్యులు కరోనా వైరస్ బారిన పడటంతో సభ్యులందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు పరీక్షలు నిర్వహిస్తోంది న్యూజిలాండ్ జట్టు మేనేజ్‌మెంట్. డేవన్ కాన్వేను ఐదురోజులపాటు ఐసోలేషన్‌కు పంపించింది. ముందుగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ కరోనా బారిన పడగా..తరువాత సిబ్బంది ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్యన జరుగుతున్న 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 0-2 తేడాతో న్యూజిలాండ్ చేజార్చుకుంది.
Also read: Rohit Sharma News: అవన్నీ అసత్య వార్తలు.. రోహిత్ శర్మకు ఏమీ కాలేదు!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook