సౌతాంప్టన్‌లోని ది రోజ్ బౌల్ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా నేడు జరగనున్న ఇంగ్లండ్ vs వెస్ట్ ఇండీస్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ విండీస్‌పై బౌలింగ్‌నే ఎంచుకున్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోంచి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఇంగ్లండ్ జట్టు వరల్డ్ కప్ జట్ల పాయింట్స్ పట్టికలో నాలుగో స్థానంలో వుండగా విండీస్ 6వ స్థానంలో వుంది. విండీస్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ జట్టులో ఎటువంటి మార్పులుచేర్పులు లేవు. అయితే, విండీస్ జట్టులో మాత్రం ఈ ఆటలో ఎవిన్ లూయిస్, ఆండ్రూ రస్సెల్, గ్యాబ్రియెల్‌లకు స్థానం దక్కింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జట్ల విషయానికొస్తే, ఇంగ్లండ్ జట్టులో ఇయాన్ మోర్గాన్(కెప్టేన్), మొయిన్ అలీ, జోఫ్ర, జానీ బెయిర్‌స్టో, జాస్ బట్లర్, టామ్ క్యూరన్, లియామ్ డేసన్, లియామ్ ప్లంకెట్, ఆదిల్ రషీద్, జోరూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, జేమ్స్ విన్స్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ ఉన్నారు.


ఇక వెస్ట్ ఇండీస్ జట్టు తరపున జేసన్ హోల్డర్(కెప్టేన్), ఫేబియన్ అల్లెన్, కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, షెల్డన్ కాట్రెల్, షేనన్ గాబ్రియెల్, క్రిస్ గేల్, షిమ్రోన్ హెట్మేర్, శాయ్ హోప్, ఎవిన్ లూయిస్, యాష్లె నర్స్, నికోలస్ పూరన్, కేమర్ రోచ్, ఆండ్రూ రస్సెల్, ఒషేన్ థామస్ ఆడుతున్నారు. 


ఈ ఆటలో మరోసారి ఇంగ్లండ్ గెలిచి పాయింట్స్ పట్టికలో ఇంకొంత పైకి ఎగబాకుతుందా లేక విండీస్ విశ్వరూపం చూపించి ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరుచుకుంటుందా అనేది మ్యాచ్ పూర్తయితే కానీ తెలిసే ఛాన్స్ లేదు.