Jos Buttler New Record: అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ జోరు కొనసాగుతోంది. వన్డేలు, టీ20ల్లో అద్భుత ఆటతో అలరిస్తున్నాడు. మొన్నటివరకు ఐపీఎల్‌లో వీరవిహారం చేసిన అతడు..నెదర్లాండ్స్‌ సిరీస్‌లో చెలరేగిపోయాడు. ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్‌తో 3-0తో సొంతం చేసుకుంది. బట్లర్‌ జోరుతో నెదర్లాండ్స్‌కు వైట్ వాష్‌ తప్పలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు వన్డేల సిరీస్‌లో అతడు 248 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. తొలి వన్డేలో కేవలం 70 బంతుల్లోనే 162 పరుగులు చేసి..ఔరా అనిపించాడు. అతడి విధ్వంసానికి స్టేడియం మూగబోయింది. మొత్తంగా ఈసిరీస్‌లో 19 సిక్స్‌లు బాదాడు. ఈక్రమంలోనే సరికొత్త రికార్డును బట్లర్ తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు.


అంతకముందు ఆ ప్లేస్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. అతడు 2005లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో 17 సిక్సర్లు కొట్టాడు. ఈ రికార్డు సాధించిన మూడో ప్లేయర్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలయర్స్ ఉన్నాడు. ప్రస్తుతం జోస్ బట్లర్ జోరు చూస్తుంటే మరికొన్ని రికార్డులు బద్ధం కావడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలో భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్‌ సిరీస్ ప్రారంభం కానుంది. 


Also read:Nandamuri Balakrishna: కరోనా బారిన పడ్డ నట సింహం..వెల్లడించిన నందమూరి బాలకృష్ణ..!


Also read:Telangana Inter Board: ఇక నుంచి వంద శాతం సిలబస్..ఇంటర్ ఫలితాలు అప్పుడేనా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.