Virat Kohli praised by Aamer Sohail: కరాచీ: టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni) అంటే టీమిండియా క్రికెటర్లకే కాదు.. ఇతర దేశాలకు చెందిన చాలామంది ఫేమస్ క్రికెటర్లకు కూడా అభిమానమే. ఆ తర్వాత మళ్లీ అదే స్థాయిలో అభిమానాన్ని ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ( Virat Kohli) సంపాదించుకుంటున్నాడు. తరచుగా పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు కోహ్లీని ఆకాశానికెత్తుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా కోహ్లీపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ అమీర్‌ సొహైల్‌ ( Aamer Sohail ) కూడా ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రస్తుత క్రికెట్‌ ఆటగాళ్లలో విరాట్ కోహ్లినే గొప్ప ఆటగాడు అంటూ కోహ్లీని అమీర్ ప్రశంసల్లో ముంచెత్తాడు. విరాట్‌ కోహ్లి ఆట ఆకట్టుకునేలా, ఆకర్షణీయంగా ఉంటుందని కితాబిచ్చిన అమీర్.. కోహ్లీ ఆట తీరును పాకిస్తాన్ లెజెండరీ మాజీ క్రికెటర్ జావెద్‌ మియాందాద్‌ ( Javed Miandad ) ఆటతో పోల్చాడు. జావేద్ మియాందాద్ ఆట ఎంత అద్భుతంగా ఉండేదో... కోహ్లీ ఆట కూడా అంతే అందంగా ఉందని అమీర్ సోహైల్ అభిప్రాయపడ్డాడు. చాహల్, కుల్దీప్‌పై యువరాజ్ సింగ్‌ కామెంట్స్.. దళిత్ రైట్స్ యాక్టివిస్ట్ ఫిర్యాదుతో కేసు నమోదు )


పాకిస్తాన్ క్రికెట్‌లో జావెద్‌ మియాందాద్ ఓ చరిత్ర సృష్టించాడని చెప్పుకొచ్చిన అమీర్ సోహైల్.. అదే సమయంలో అతడిపై పలు విమర్శలు కూడా చేశాడు. పాకిస్తాన్ క్రికెట్‌ని ( Pakistan Cricket) శిఖరమంత ఎత్తులో నిలబెట్టిన జావేద్ మియాందాద్.. పలుసార్లు జట్టుకు అవసరమైనప్పుడు మాత్రం విఫలమయ్యాడని.. అటు కోహ్లీ విషయంలో కూడా అలా జరిగిన సందర్భాలున్నాయని అన్నాడు. అలాగే జావేద్ మియాందాద్ తనలాంటి ఎంతో మంది క్రికెటర్లకు స్పూర్తిగా నిలిచాడని.. అలాగే కోహ్లీ కూడా యువ ఆటగాళ్లు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడని అమీర్ చెప్పుకొచ్చాడు. అందుకే జావేద్ మియాందాద్‌కి విరాట్ కోహ్లీకి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని అమీర్ వ్యాఖ్యానించాడు. తన యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే అమీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..