Ryan Campbell Heart Attack: నెదర్లాండ్‌ క్రికెట్‌ హెడ్‌ కోచ్‌ రియాన్‌ క్యాంప్‌బెల్‌ ఐసీయూలో చేరాడు. శనివారం ఉదయం పిల్లలతో కలిసి గ్రౌండ్‌ లో ఆడుతుండగా.. క్యాంప్‌ బెల్‌ కు హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. వెంటనే లండన్‌ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. శనివారం నుంచి కోమాలో ఉన్న క్యాంప్‌ బెల్‌ మంగళవారం సొంతంగా ఊపిరి తీసుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. అయినప్పటికీ క్యాంప్‌ బెల్‌ (50)ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఓ స్పష్టతకు రాలేమన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యాంప్‌ బెల్‌ అంతర్జాతీయంగా ఆస్ట్రేలియాతో పాటు హంగ్‌ కాంగ్‌ జట్టుకు ప్రాతనిథ్యం వహించాడు. ఆడం గిల్‌ క్రిస్ట్‌ గైర్హాజరుతో 2002లో ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌ తో తన తొలి వన్డే ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ ఆడాడు. అదే సంవత్సరం డిసెంబర్‌ లో శ్రీలంకతో జరిగిన మ్యాచే అతినికి చివరిది. మొత్తంగా ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు క్యాంప్‌ బెల్‌ రెండు వన్డేలు మాత్రమే ఆడాడు. అటు 44 ఏళ్ల వయసులో హంగ్‌కాంగ్‌ జాతీయజట్టుతో టీట్వంటీలోకి ఎంట్రీ ఇచ్చాడు క్యాంప్‌బెల్‌. టీట్వంటీలోనూ మూడు మ్యాచ్‌ లు మాత్రమే ఆడాడు. 2016 మార్చి 8న జింబాబ్వే, 10న ఆప్ఘనిస్తాన్‌, 12 న స్కాట్లాండ్‌ తో జరిగిన మ్యాచ్‌ ల్లో హంగ్‌ కాంగ్‌ జట్టు తరఫున ఆడాడు.  క్యాంప్‌ బెల్‌ నెదర్లాండ్‌ హెడ్‌ కోచ్‌ గా 2017 జనవరిలో అపాయింట్‌ అయ్యాడు.


Also Read: Flipkart Tv Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఆ టీవీపై 25 వేల రూపాయలు భారీ డిస్కౌంట్, ఇవాళే చివరిరోజు


Also Read: Sri Lankan Lessons: ఉచితాలతో గండమే.. శ్రీలంక పాఠాలు నేర్చుకోవాల్సిందే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook