ఆసియా కప్ లో భాగంగా పసికూన హాంకాంగ్ పై మహేంద్ర సింగ్ ధోనీ డక్కౌట్ అభిమానులకు తీవ్ర నిరాశలో ముంచెత్తింది. ఆ సమయంలో స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్న ఓ బుల్లి వీరాభిమాని ఆవేశంతో ఊగిపోయాడు. ఆ బాలుడికి ఎంత ఆగ్రహం వచ్చిందంటే...కుర్చీలను కూడా తన్నాడు. పెద్దగా అరుస్తూ గంతులేశాడు. శిఖర్ ధావన్ బాదుతున్నప్పుడెల్లా ఆనందంతో గంతులేస్తూ..కనిపించిన ఆ బుడతడు.. ధోనీ అవుట్ అయిన తరువాత ఏం చేశాడో మీరూ చూడండి.



నవ్వు తెప్పిస్తున్న ఆ బాలుడి అసహనాన్ని .. బహుశ ధోనీ చూసినట్లయితే ఇక జీవితంలో డకౌట్ కాకుండా జాగ్రత్త పడతాడేమో. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతోంది.