Roger Federer, Rafael Nadal Crying at Laver Cup 2022: టెన్నిస్‌ దిగ్గజం, స్విస్‌ మాస్టర్‌ రోజ‌ర్ ఫెద‌ర‌ర్ టెన్నిస్ కేరీర్ ముగిసింది. స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నాదల్‌తో కలిసి లావెర్ క‌ప్‌ 2022లో డ‌బుల్స్ మ్యాచ్‌ ఆడిన ఫెద‌ర‌ర్ ఓటమిపాలయ్యారు. ఫెద‌ర‌ర్‌, రఫెల్ నాద‌ల్ జోడి 4-6, 7-6 (7/2), 11-9 స్కోర్‌తో ఫ్రాన్సెస్ టియాఫో, జాక్ సాక్ చేతిలో ఓటమిని చవిచూశారు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత రోజ‌ర్ కంటిత‌డి పెట్టారు. ఫెదరర్‌ కన్నీళ్లు చూసి నాదల్‌ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లావెర్ క‌ప్‌ 2022తో రోజ‌ర్ ఫెదరర్‌ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ కెరీర్‌ ముగిసింది. దీంతో మ్యాచ్‌ అనంతరం తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. తన ప్రియ సహచరుడైన నాదల్‌తో పాటు తోటి ఆటగాళ్లను హత్తుకుని కంటిత‌డి పెట్టారు. ఫెదరర్‌ను చూసి తట్టుకోలేక నాదల్‌ కూడా ఏడ్చేశాడు.  అంతేకాదు ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆపై నిత్యం తనకు అండగా నిలిచిన భార్య మిర్కాను హత్తుకుని ఫెదరర్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఈ జ‌ర్నీ అద్భుతంగా సాగింద‌ని, సంతోషంగా ఉన్నాన‌ని ఫెద‌ర‌ర్ అన్నారు.


రోజ‌ర్ ఫెదరర్‌, రఫెల్ నాదల్‌ ఏడుస్తున్న ఫోటోలను ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నిర్వాహకులు తమ ట్విటర్ వేదికగా షేర్‌ చేశారు. 'చిరకాల ప్రత్యర్థులు, బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఫర్‌ ఎవర్‌. ఈ దృశ్యం చూడడానికే చాలా బాధగా ఉంది' అని పేర్కొంది. మరోవైపు ఫెదరర్‌ కన్నీటికి సంబంధించిన వీడియోను లేవర్‌ కప్‌ ట్విటర్‌ ఖాతాలో పంచుకుని.. స్విస్‌ దిగ్గజానికి ఘనంగా వీడ్కోలు పలికింది. 



రోజ‌ర్ ఫెదరర్‌ తన కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్స్‌ నెగ్గారు. అందులో 2 ఆస్ట్రేలియా ఓపెన్‌, 1 ఫ్రెంచ్‌ ఓపెన్‌, 8 వింబుల్డన్‌, 5 యూఎస్‌ ఓపెన్‌ టైటిల్స్‌ ఉన్నాయి. కెరీర్‌ మొత్తంలో 1526 సింగిల్స్, 223 డబుల్స్‌ మ్యాచ్‌లు ఆడారు. కెరీర్‌లో గెలిచిన మొత్తం టైటిల్స్‌ 103. ఫెదరర్‌ కెరీర్‌లో 1251 విజయాలు, 275 ఓటములను ఎదుర్కొన్నారు. ఫెడరర్‌ ఒక్కసారి కూడా మ్యాచ్‌ మధ్యలో రిటైర్‌ కాకపోవడం విశేషం.  


Also Read: ఆ సామర్థ్యం రోహిత్ శర్మకు తప్ప మరెవరికీ లేదు: దినేష్ కార్తీక్
Also Read: ఆ కారణంతోనే.. పంత్ కంటే ముందుగా దినేష్ కార్తీక్ బ్యాటింగ్‌కు వచ్చాడు: రోహిత్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.