మిథాలీ జయహో ; కోహ్లీ, రోహిత్ శర్మల రికార్డు బ్రేక్
ఫ్రపంచ క్రికెట్ మేటి ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఈ ఇద్దరు స్థార్ క్రికెటర్ల సాధించిన రికార్డులు బద్దలు కొట్టాలంటే అది ఆషామాషిగా జరిగే పని కాదు. అలాంటి ఈ స్టార్ క్రికెటర్లను ఓ మహిళా క్రికెటర్ వెనక్కి నెట్టేసింది. వారిద్దరిని మించి పరుగులు రాబట్టింది. నమ్మసక్యంగా లేనప్పటికీ ఇది వాస్తవం. వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది
టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను రికార్డును టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బద్దలు కొట్టింది. టీం ఇండియా తరఫున టీ-20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రోహిత్ పేరిట ఉంది. అతని రికార్డును మిథాలీరాజ్ బద్దలు కొట్టి అగ్రస్థానంలో నిలిచింది. నిన్నటి మ్యాచ్‌లో 47 బంతుల్లో 56 పరుగులు చేసిన ఆమె 2 వేల 232 పరుగులు చేసి మొదటి స్థానాన్ని దక్కించుకోన్నారు. ఇలా 2 వేల 207 పరుగులతో ఉన్న రోహిత్‌ని రెండో స్థానానికి నెట్టేసింది.
ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ-20లో సెంచరీతో చెలరేగిన రోహిత్ టీం ఇండియా తరఫున టీ-20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీని దాటి తాను మొదటి స్థానంలో నిలిచాడు. అంతేకాక అంతర్జాతీయ టీ-20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్.. రోహిత్ రికార్డును బద్దలు కొట్టడం గమనార్హం.
టీమిండియా క్రికెట్ అంటే కోహ్లీ సేన అనే గుర్తింపు ఉంది. ఈ విషయంలో మహిళా క్రికెట్ జట్టుకు ఏమాత్రం క్రేజ్ లేదు. ఆదరణ కవువైనప్పటికీ..ఇవి తనకు ఏమాత్రం అడ్డురావని మిథాలీ రుజువు చేసింది కదూ...హ్యాట్సాఫ్ మిథాలి..మహిళ క్రికెట్ జయహో