Andrew Symonds Died:ఆస్ట్రేలియా క్రికెట్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ అకాల మరణం చెందారు. మరో ఆటగాడు రాడ్ మర్ష్ చనిపోయాడు. ఆ రెండు ఘటనలు మరవకముందే మరో విషాదం జరిగింది. ఆసిస్ మాజీ ఆల్ రౌండర్, విధ్వంసర బ్యాటర్ గా పేరొందిన ఆండ్రూ సైమండ్స్  చనిపోయారు. కారు ప్రమాదంలో సైమండ్స్ చనిపోయినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు, అతని స్నేహితులు తెలిపారు. ప్రస్తుతం సైమండ్స్ వయసు 46 సంవత్సరాలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం రాత్రి క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలోని టౌన్స్‌విల్లే వెలుపల సైమండ్స్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు రోడ్డుపై నుంచి  బోల్తా పడడంతో  అతను తీవ్రంగా గాయపడ్డాడు. సైమండ్స్ ను బతికించటానికి ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది ప్రయత్నించినా విఫలమైంది. సైమండ్స్ చనియినట్లు స్థానిక పోలీసులు ప్రకటించారు.  తన కెరీర్ లో 26 టెస్టులు. 198 వన్డేలు ఆడాడు ఆండ్రూ సైమండ్స్. సైమండ్స్ మృతితో క్రికెట్ ఆస్ట్రేలియా తీవ్ర విషాదం నెలకొంది. నమ్మలేకపోతున్నామంటూ అతని సహచరులు స్పందించారు.


ఆస్ట్రేలియా టాప్ ఆల్ రౌండర్ గా నిలిచాడు ఆండ్రూ సైమండ్స్. ఎన్నో మ్యాచ్ లోను ఒంటిచేత్తో గెలిపించాడు. 2003, 2007లో ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్ లో సభ్యుడిగా ఉన్నాడు. కాని 2008లో వెలుగుచూసిన మంకీగేట్ ఎపిసోడ్ లో సైమండ్స్  వార్తల్లో నిలిచాడు. ఆ ఘటన అతని జీవితంలో మచ్చగా నిలిచిపోయింది. 2008లో సిడ్నీలో జరిగిన  టెస్టులో భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనను కోతి అని పిలిచాడని సైమండ్స్ ఆరోపించాడు. ఏ తప్పు చేయలేదని ఖండించాడు సింగ్.  అయినా సింగ్ ను మూడు మ్యాచ్‌లకు సస్పెండ్ చేశారు. సిరీస్ నుంచి తప్పుకుంటామని భారత్ బెదిరించడంతో హర్భజన్ సింగ్ పై నిషేధాన్ని రద్దు చేసింది ఐసీసీ. 


READ ALSO: Domestic Violence Case: ఇంట్లో గోడ.. పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని మనవడిపై గృహహింస కేసు


READ ALSO: ళ్యాణి vs శ్రీకాంత్ రెడ్డి వివాదంలో వర్షిణి వెర్షన్ ఏంటి ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి