ముంబై: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. అయితే టీమిండియా ఓటమి కంటే అందరు మాట్లాడుకుంటున్న అంశం కెప్టెన్ విరాట్ కోహ్లీ అనాలోచిత నిర్ణయం. బ్యాటింగ్ ఆర్డర్‌లో 3 నుంచి 4వ స్థానానికి డిమోట్ కావడంపై మాజీలు అసంతృప్తి వ్యక్తి చేస్తున్నారు. వన్ డౌన్‌లో రావాల్సిన కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు ఎందుకొచ్చాడని ఆస్ట్రేలియా మాజీ డాషింగ్ క్రికెటర్ మాథ్యూ హెడేన్ ప్రశ్నించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: భారత్‌పై శతక్కొట్టిన వార్నర్, ఫించ్.. ఆసీస్ ఘన విజయం


‘కోహ్లీ కెరీర్ దాదాపు మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 180 ఇన్నింగ్స్‌ల్లో 63 సగటుతో 9500 పైచిలుకు పరుగులు సాధించాడు. కానీ నాలుగో స్థానంలో చివరి 7 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఒక్కసారి కూడా 20 పరుగులు కూడా చేయలేదు. అలాంటిది 3వ స్థానంలో బ్యాటింగ్ ఎందుకు వదులుకున్నాడో అర్థం కావడం లేదు. కోహ్లీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని కూడా ఆలోచించలేకపోతున్నా. ప్రపంచంలో బెస్ట్ టీమ్‌తో మ్యాచ్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కోహ్లీ మూడో స్థానంలో ఆడకపోవడంతో జట్టు భారీ మూల్యాన్ని చెల్లించుకుందని’ హెడేన్ అభిప్రాయపడ్డాడు.


Also Read: భారత్‌తో తొలి వన్డే: ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డ్


మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో ముంబైలో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (128; 112 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌), ఆరోన్ ఫించ్ (110; 114 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌) శతకాలతో చెలరేగడంతో కేవలం 37.4 ఓవర్లలోనే  ఆ జట్టు సునాయసంగా గెలుపొందింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 49.1 ఓవర్లలో 255పరుగులకు ఆలౌటైంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..